ఈసారి ప్రేక్షకులను గెలిపించాలనుకుంటున్నాను: శ్రీవిష్ణు | Sree Vishnu Comments On Swag Movie At Pre Release Event | Sakshi
Sakshi News home page

ఈసారి ప్రేక్షకులను గెలిపించాలనుకుంటున్నాను: శ్రీవిష్ణు

Oct 3 2024 1:56 PM | Updated on Oct 3 2024 3:02 PM

Sree Vishnu Comments On Swag Movie At Pre Release Event

‘‘తెలుగు ప్రేక్షకుల ప్రోత్సాహం వల్లే మేం గెలుస్తుంటాం. ఈసారి ప్రేక్షకులను గెలిపించాలనుకుంటున్నాను. దాని కోసం ఎంతో కష్టపడ్డాం. నిజంగా మీకు మా ‘శ్వాగ్‌’ సినిమా నచ్చితే అభినందిస్తూ రెండు చప్పట్లు కొట్టండి చాలు. ఈ నెల 4న థియేటర్స్‌కి వచ్చి మీరు గెలిచి, నన్ను గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అని హీరో శ్రీవిష్ణు అన్నారు. 

హసిత్‌ గోలి దర్శకత్వంలో శ్రీవిష్ణు, రీతూ వర్మ జంటగా నటించిన చిత్రం ‘శ్వాగ్‌’. మీరా జాస్మిన్, దక్షా నగార్కర్‌ కీలక పాత్రలు పోషించారు. టీజీ విశ్వప్రసాద్‌ నిర్మించిన ఈ సినిమా రేపు (శుక్రవారం) విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో టీజీ విశ్వప్రసాద్‌ మాట్లాడుతూ– ‘‘మా బ్యానర్‌కి ‘గూఢచారి, ఓ బేబీ, కార్తికేయ 2’ సినిమాలు చాలా పెద్ద సక్సెస్‌ ఇచ్చాయి. 

‘శ్వాగ్‌’ కూడా అలాంటి సక్సెస్‌ ఇస్తుంది. ఈ మూవీలో శ్రీవిష్ణు నటన చూశాక కమల్‌హాన్‌గారితో ΄ోల్చుతారు’’ అని తెలి΄ారు. ‘‘శ్రీ విష్ణు, వివేక్‌ ఆత్రేయ స΄ోర్ట్‌తోనే ఈ ప్రయాణం కొనసాగిస్తున్నాను. ‘రాజ రాజ చోర’ సినిమా తర్వాత రెండో సినిమా ‘శ్వాగ్‌’ని విశ్వప్రసాద్‌గారి నిర్మాణంలో చేయడం చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు హసిత్‌ గోలి. 

Advertisement
 
Advertisement
Advertisement