శోభిత ధూళిపాళ టైమ్‌ వచ్చింది.. స్టార్‌ డైరెక్టర్‌ సినిమాలో ఛాన్స్‌ | Sobhita Dhulipala Next Movie Plan With PA Ranjith, Interesting Deets Inside | Sakshi
Sakshi News home page

శోభిత టాలెంట్‌ చూపే టైమ్‌ వచ్చింది.. స్టార్‌ డైరెక్టర్‌ సినిమాలో ఛాన్స్‌

Apr 1 2025 7:06 AM | Updated on Apr 1 2025 10:50 AM

Sobhita Dhulipala Next Movie Plan With d Pa. Ranjith

కోలీవుడ్‌ దర్శకుడు పా.రంజిత్‌( Pa. Ranjith) కథలే కాదు ఆయన దర్శకత్వం శైలి కూడా ఇతర చిత్రాలకు భిన్నంగా ఉంటుంది. అట్టకత్తి,     మద్రాస్‌ చిత్రాల నుంచి సార్పట్ట పరంపర, తంగలాన్‌ వంటి చిత్రాలే పా.రంజిత్‌ వైవిధ్య దర్శక శైలికి నిదర్శనం.  తంగలాన్‌లో నటుడు విక్రమ్‌ , నటి పార్వతీ, మాళవికా మోహన్‌ల వేషధారణ, హావభావాలకు మంచి పేరు వచ్చింది. కాగా పా.రంజిత్‌ తదుపరి సార్పట్ట పరంపర– 2 చిత్రం చేయబోతున్నట్లు, అదే విధంగా హిందీలో పర్సీ చిత్రం చేయబోతున్నట్లు ప్రచారం జరిగింది. అయితే అవేవీ కాకుండా ప్రస్తుతం ఆయన వెట్టువన్‌ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో నటుడు దినేశ్‌ హీరోగా,ఆర్య విలన్‌గా నటిస్తున్నారు. అట్టకత్తి చిత్రం తరువాత వీరి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ఇది. 

అదే విధంగా నటుడు అశోక్‌ సెల్వన్, ఫహాద్ ఫాజిల్ ఈ చిత్రంలో ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. కాగా ఇందులో నటి శోభిత ధూళిపాళ( Sobhita Dhulipala) నాయకిగా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలవడలేదన్నది గమనార్హం. కాగా ఈమె ఇంతకు ముందు మణిరత్నం దర్శకత్వం వహించిన పొన్నియిన్‌ సెల్వన్‌ చిత్రంలో కీలక పాత్ర పోషించారన్నది గమనార్హం. మేడ్‌ ఇన్‌ హెవన్‌, మేజర్‌ వంటి చిత్రాల్లో శోభిత తన నటనతో మెప్పించింది. అయితే, పా.రంజిత్‌ లాంటి డైరెక్టర్‌ సినిమాలో ఒకరు నటిస్తున్నారంటే వారి పాత్ర చాలా భిన్నంగా ఉంటుంది. అందుకు వారు సెట్‌ అవుతారని ఆయన భావిస్తేనే ఛాన్స్‌ ఇస్తారు. శోభితకు సరైన పాత్ర పడితే దుమ్మురేపుతుందని పేరు ఉంది. 

ఇప్పుడు ఈ కాంబినేషన్‌ సెట్‌ అయితే శోభిత టాలెంట్‌ చూపే టైమ్‌ వచ్చిందని చెప్పవచ్చు. నాగచైతన్యతో( Naga Chaitanya) పెళ్లి తర్వాత ఆమె ఈ బిగ్‌ ప్రాజెక్ట్‌లో భాగం కానుందని సమాచారం. కాగా ఈ చిత్రాన్ని గోల్డన్‌ రెయోమ్స్‌ సంస్థతో కలిసి దర్శకుడు .పా.రంజిత్‌కు చెందిన నీలం ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. కాగా ఈ చిత్ర పస్ట్‌లుక్‌ పోస్టర్‌ను 2022లో జరిగిన కాన్‌ చిత్రోత్సవాల వేదికపై ఆవిష్కరించారన్నది గమనార్హం. ఇప్పుడు ఈ చిత్ర షూటింగ్‌ను ప్రారంభించారు. కాగా ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని విషయాలు త్వరలోనే వెలువడే అవకాశం ఉంది.  

Advertisement
 
Advertisement
Advertisement