రెండో బిడ్డకు జన్మనిచ్చిన బుల్లితెర నటి..! | Smriti Khanna on welcoming second child with husband Gautam Gupta | Sakshi
Sakshi News home page

Smriti Khanna: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన చిన్నారి పెళ్లి కూతురు నటి!

Sep 16 2024 7:44 PM | Updated on Sep 16 2024 8:28 PM

Smriti Khanna on welcoming second child with husband Gautam Gupta

బుల్లితెర భామ స్మృతి ఖన్నా పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. 2017లో నటుడు తమ్ గుప్తాను పెళ్లాడిన నటికి ఇప్పటికే అనైక కూతురు కూడా ఉన్నారు. తాజాగా మరో బిడ్డకు జన్మనిచ్చారు. ఈ బుల్లితెర జంటకు రెండో కూతురికి తమ జీవితంలోకి ఆహ్వానం పలికారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

స్మృతి ఖన్నా బాలీవుడ్‌లో మెరీ ఆషికి తుమ్‌ సే హై అనే సీరియల్‌తో కెరీర్ ప్రారభించింది. ఆ తర్వాత యే హై ఆషికి, సీఐడీ, బాలికా వధు(తెలుగులో చిన్నారి పెళ్లికూతురు) లాంటి సీరియల్స్‌తో మెప్పించింది. చిన్నారి పెళ్లికూతురు సీరియల్‌లో డాక్టర్‌ వందనా మిట్టల్ పాత్రలో అలరించింది. అంతే కాకుండా పలు రియాలిటీ షోలలో కంటెస్టెంట్‌గా పాల్గొంది. వీటితో పాటు జట్‌ ఎయిర్‌వేస్ అనే పంజాబీ చిత్రంలో కీలక పాత్రలో నటించింది. చివరిసారిగా 2022లో వచ్చిన దప్పా అనే వెబ్ సిరీస్‌లో కనిపించింది. అయితే పెళ్లి తర్వాత సీరియల్స్‌కు గుడ్‌బై చెప్పేసింది బుల్లితెర భామ స్మృతి ఖన్నా.  
 

Advertisement
 
Advertisement
Advertisement