breaking news
Balika Vadhu actress
-
నటి ప్రత్యూష కేసులో మాజీ ప్రియుడికి ఊరట
ప్రముఖ టీవీ నటి, ‘బాలికా వధు’ ఫేమ్ ప్రత్యూష బెనర్జీ కేసులో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఆమె మాజీ ప్రియుడు, నటుడు–నిర్మాత రాహుల్ రాజ్ సింగ్‌కు భారీ ఊరట లభించింది. ఈ కేసు నుంచి ఆయనకు విముక్తి ఇస్తూ బాంబే హైకోర్టు బుధవారం తీర్పు ఇచ్చింది. తీర్పు సందర్భంగా.. ఇక ఆయన ఎలాంటి విచారణ ఎదుర్కోవాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించింది.హిందీ బుల్లితెర నటి ప్రత్యూష బెనర్జీ పదేళ్ల కిందట బలవన్మరణానికి పాల్పడ్డారు. అయితే ఆమెను ప్రియుడు రాహుల్ రాజ్‌సింగ్ ఆత్మహత్యకు ప్రేరేపించారన్నది ప్రధాని అభియోగం. అయితే సుదీర్ఘ విచారణ అనంతరం.. ఈ కేసులో ప్రత్యూష బెనర్జీ మరణానికి ముందు రాహుల్ రాజ్ సింగ్‌తో మాట్లాడిన చివరి ఫోన్ సంభాషణను కోర్టు కీలకంగా పరిగణించింది. ఆనాడు.. ఈ సంభాషణలో ప్రత్యూష తీవ్ర ఆందోళనలో ఉన్నట్లు ట్రాన్స్క్రిప్ట్ ద్వారా తెలుస్తోందని కోర్టు పేర్కొంది. అదే సమయంలో రాహుల్ ఆమెను ఎలాంటి తీవ్ర నిర్ణయం తీసుకోవద్దని నచ్చజెప్పేందుకు ప్రయత్నించినట్లు తెలిపింది. తాను కారును వెనక్కి తిప్పుకుని ఆమెను కలిసేందుకు వస్తున్నానని కూడా రాహుల్ చెప్పినట్లు కోర్టు గుర్తించింది. ఈ సంభాషణను పరిశీలించిన న్యాయస్థానం.. ప్రత్యూషను ఆత్మహత్యకు ప్రేరేపించారన్న ఆరోపణలకు ఇది అనుకూలంగా లేదన్న వాదనను పరిగణనలోకి తీసుకుంది.పదేళ్ల క్రితం ఏం జరిగిందంటే..పాపులర్ సీరియల్ ‘బాలికా వధు’లో ఆనంది పాత్రతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రత్యూష బెనర్జీ 2016 ఏప్రిల్ 1న ముంబైలోని గోరేగావ్‌లో తాను అద్దెకు ఉంటున్న నివాసంలో మృతిచెందారు. ఆమె మరణం అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించింది. ప్రత్యూష తల్లిదండ్రులు ఆమెతో అప్పట్లో సహజీవనం చేస్తున్న రాహుల్ రాజ్ సింగ్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. మానసిక, శారీరక వేధింపులకు పాల్పడ్డారని.. ఆమె ఆత్మహత్యకు రాహుల్ ప్రేరేపించారని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆయనపై ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసు నమోదు చేశారు.సుదీర్ఘ పోరాటం తర్వాత..కేసు నమోదైన కొన్ని నెలలకే 2016 జూలైలో రాహుల్ రాజ్ సింగ్‌కు బాంబే హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అనంతరం పోలీసులు 2018లో చార్జిషీట్ దాఖలు చేశారు. తనపై నమోదైన కేసు నుంచి డిశ్చార్జ్ చేయాలని రాహుల్ సెషన్స్ కోర్టును ఆశ్రయించారు. అయితే అక్కడ ఆయనకు నిరాశ ఎదురైంది. దీంతో హైకోర్టును ఆశ్రయించారు.రాహుల్ తరఫున సీనియర్ న్యాయవాది ఆబాద్ పొండా, న్యాయవాది శ్రేయాన్ష్ మిథారే వాదనలు వినిపించారు. ప్రత్యూషతో జరిగిన చివరి ఫోన్ సంభాషణలో ఆమెను తీవ్ర నిర్ణయం తీసుకోవద్దని రాహుల్ నచ్చజెప్పిన విషయం స్పష్టంగా ఉందని వారు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అందువల్ల ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు కేసు కొనసాగించడానికి తగిన ఆధారాలు లేవని వాదించారు. అలాగే ప్రత్యూష తన నిర్ణయానికి సంబంధించి పలువురి పేర్లను ప్రస్తావించిందని.. ఆమె తల్లిదండ్రుల గురించి కూడా సంభాషణలో మాట్లాడిందని రాహుల్ తరఫు న్యాయవాదులు పేర్కొన్నారు. ఆత్మహత్య లేఖ కూడా లేని పరిస్థితుల్లో తొందరగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారని వారు వాదించారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న బాంబే హైకోర్టు.. రాహుల్ రాజ్ సింగ్‌ను కేసు నుంచి డిశ్చార్జ్ చేసింది. దీంతో క్రిమినల్ ట్రయల్ నుంచి ఆయనకు ఊరట లభించినట్లైంది.ఇదీ చదవండి: వాటికి ఇంకెప్పుడు మోక్షమయ్యా? -
రెండో బిడ్డకు జన్మనిచ్చిన బుల్లితెర నటి..!
బుల్లితెర భామ స్మృతి ఖన్నా పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. 2017లో నటుడు తమ్ గుప్తాను పెళ్లాడిన నటికి ఇప్పటికే అనైక కూతురు కూడా ఉన్నారు. తాజాగా మరో బిడ్డకు జన్మనిచ్చారు. ఈ బుల్లితెర జంటకు రెండో కూతురికి తమ జీవితంలోకి ఆహ్వానం పలికారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.స్మృతి ఖన్నా బాలీవుడ్లో మెరీ ఆషికి తుమ్ సే హై అనే సీరియల్‌తో కెరీర్ ప్రారభించింది. ఆ తర్వాత యే హై ఆషికి, సీఐడీ, బాలికా వధు(తెలుగులో చిన్నారి పెళ్లికూతురు) లాంటి సీరియల్స్‌తో మెప్పించింది. చిన్నారి పెళ్లికూతురు సీరియల్లో డాక్టర్ వందనా మిట్టల్ పాత్రలో అలరించింది. అంతే కాకుండా పలు రియాలిటీ షోలలో కంటెస్టెంట్‌గా పాల్గొంది. వీటితో పాటు జట్ ఎయిర్వేస్ అనే పంజాబీ చిత్రంలో కీలక పాత్రలో నటించింది. చివరిసారిగా 2022లో వచ్చిన దప్పా అనే వెబ్ సిరీస్‌లో కనిపించింది. అయితే పెళ్లి తర్వాత సీరియల్స్‌కు గుడ్‌బై చెప్పేసింది బుల్లితెర భామ స్మృతి ఖన్నా. View this post on Instagram A post shared by Smoo (@smriti_khanna) -
సోనారికా బాటలో 'బాలికా వధు' నటి
సోనారికా భడోరియాకు తానేం తక్కువ కాదంటోంది హిందీ టీవీ నటి నేహా మర్దా. 'దేవోన్ కా దేవ్ మహదేవ్' సీరియల్లో పార్వతి పాత్రలో నటించిన సోనారికా గతవారం కురచ దుస్తుల్లో కుర్రకారు హార్ట్ బీట్ పెంచగా.. ఇప్పుడు 'బాలికా వధు' ఫేం నేహా కూడా అదేపని చేసింది. బికినీలో కనిపించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. సమ్మర్ హాలిడేస్ ఎంజాయ్ చేసేందుకు థాయలాండ్ వెళ్లిన అమ్మడు అక్కడి బీచుల్లో సేదతీరింది. సముద్రతీరంలో సెలవులను సరదాగా గడిపింది. ఈ సందర్భంగా తీసుకున్న ఫొటోలను తన ఇన్స్టాగ్రాఫ్ పేజీలో పోస్టు చేసింది. ఒడ్డున నిలబడి నీలాకాశం, సముద్రంను చూడడం అద్భుతంగా ఉందని, ఈ దృశ్యం తనకెంతో నచ్చిందని కూడా రాసింది. అయితే నేహా ఫొటోలు అభిమానులకు కనువిందు చేస్తున్నాయి. సోనారికా బికినీ ఫొటోలపై సోషల్ మీడియాలో దుమారం రేగినా పట్టించుకోకుండా నేహా తన ఫొటోలు పోస్ట్ చేయడం గమనార్హం. పవిత్రమైన పార్వతిదేవి పాత్రలో నటించి బికినీ ఫొటోలా? అంటూ సోనారికాపై నెటిజన్లు కారాలు-మిరియాలు నూరారు. పవిత్రమైన పాత్రలో నటించి.. బికినీ ఫొటోలా?


