స్పైడర్‌ విలన్‌ సూర్య హీరోగా బొమ్మై, రిలీజ్‌ ఎప్పుడంటే? | SJ Suryah, Priya Bhavani Shankar Starrer Bommai Gets Release Date Ott | Sakshi
Sakshi News home page

Bommai Movie: మూడుసార్లు వాయిదా.. ఎట్టకేలకు రిలీజ్‌కు రెడీ అయిన బొమ్మై

Jun 4 2023 4:43 PM | Updated on Jun 4 2023 4:43 PM

SJ Suryah, Priya Bhavani Shankar Starrer Bommai Gets Release Date Ott - Sakshi

ఇప్పటికే మూడుసార్లు వాయిదా పడింది. ఇలాంటి పరిస్థితుల్లో ఎట్టకేలకు చిత్రం తెర

స్పైడర్‌ విలన్‌, ప్రముఖ నటుడు ఎస్‌జే సూర్య, హీరోయిన్‌ ప్రియా భవానీ శంకర్‌ జంటగా నటించిన చిత్రం బొమ్మై. మాన్‌స్టర్‌ వంటి సక్సెస్‌ ఫుల్‌ చిత్రం తరువాత ఈ జంట కలిసి నటించిన చిత్రమిది. వైవిధ్య భరిత కథా చిత్రాల దర్శకుడు రాధామోహన్‌ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ఏంజెల్‌ స్టూడియో పతాకంపై వి.మారుడు పాండియన్‌, డాక్టర్‌ జాస్మిన్‌ సంతోష్‌, డాక్టర్‌ దీప డి.దురై కలిసి నిర్మించారు. యువన్‌ శంకర్‌ రాజా సంగీతాన్ని, రిచర్డ్‌ ఎం.నాథన్‌ ఛాయాగ్రహణం అందించారు.

ఇందులో నటి చాందిని, డౌట్‌ సెంథిల్‌, ఆరోల్‌ శంకర్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్ర ట్రైలర్‌ గత ఏడాది విడుదలై మంచి స్పందన తెచ్చుకుంది. అదే విధంగా ఇటీవల ఆడియో రిలీజ్‌ ఫంక్షన్‌ కూడా చేశారు. కాగా రొమాంటిక్‌, సైకలాజికల్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని అనివార్య కారణాల వల్ల విడుదల తేదీ ఇప్పటికే మూడుసార్లు వాయిదా పడింది. ఇలాంటి పరిస్థితుల్లో ఎట్టకేలకు చిత్రం తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. బొమ్మై చిత్రం ఈ నెల 16వ తేదిన తెరపైకి రానున్నట్లు నటుడు ఎస్‌జే సూర్య శుక్రవారం తన ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. ఇది దర్శకుడు రాధామోహన్‌ చిత్రం కావడంతో సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

చదవండి: నా మాజీ భార్త ఎంతోమంది అమ్మాయిల జీవితాలతో ఆడుకున్నాడు: నటి

Advertisement
 
Advertisement
Advertisement