
‘ఆపరేషన్ సిందూర్’లో మీరమరణం పొందిన మన తెలుగుబిడ్డ మురళీనాయక్‌పై సింగర్ మంగ్లీ ఒక పాట పాడారు. తన జ్ఞాపకాలను ఒక పాట రూపంలో మంగ్లీ తెలిపారు. ప్రతి ఒక్కరికి కన్నీళ్లు తెప్పించేలా ఆ సాంగ్ ఉందంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలంలోని గడ్డం తాండ పంచాయతీ కల్లి తాండా గ్రామానికి చెందిన మురళీ నాయక్ ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా సరిహద్దుల్లో దేశమాత కోసం పోరాడుతూ నేలకొరిగాడు.
ఈ వార్తతో ఆ కుటుంబం తల్లడిల్లిపోయింది. వారికి అండగా రెండు తెలుగురాష్ట్రాల ప్రజలు నిలిచారు. ఈ క్రమంలో మురళీ నాయక్ తల్లిదండ్రులను మంగ్లీ కూడా కలిసి ఓదార్చారు. దేశంలోని మహిళల సిందూరం కాపాడేందుకు తన ప్రాణాలను అర్పించాడని ఆమె కొనియాడారు. దేశంలోని ప్రతి మహిళ సిందూరంలో మురళీనాయక్ నిలిచి ఉంటాడని మంగ్లీ భావోద్వగభరితంగా చెప్పారు. ఇప్పుడు తాజాగా తన పాట రూపంలో ప్రపంచానికి తెలిపారు.