సైమా అవార్డ్స్‌.. నాని హిట్‌ సినిమాకే ఎక్కువ క్రేజ్‌ | Siima Awards 2024 Invite Nominations, Check For Movies List, Date And Venue Details | Sakshi
Sakshi News home page

SIIMA Awards 2024: నాని హిట్‌ సినిమాకే ఎక్కువ క్రేజ్‌

Jul 16 2024 3:11 PM | Updated on Jul 16 2024 5:47 PM

Siima Awards 2024 Invite Nominations

సినీ రంగానికి సంబంధించి ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డుల్లో సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌ (సైమా) ఒకటి. ఈ అవార్డుల విషయంలో ప్రేక్షకులకు తీపి కబురు వినిపించింది సైమా.  తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ చిత్ర పరిశ్రమకి చెందిన నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణుల్ని ప్రోత్సహించే ఉద్దేశంతో ప్రారంభమైంది. 12 ఏళ్లుగా విజయవంతంగా ఈ పురస్కారాల వేడుకలు జరుగుతున్నాయి. 2024 ఏడాది సైమా ఉత్సవాలకు ముహూర్తం ఖరారైంది.

ఈ ఏడాది సెప్టెంబరు 14, 15 తేదీల్లో జరగనున్న ఈ వేడుకకు దుబాయ్‌ వేదిక కానుంది. ఈ అవార్డ్స్‌ దక్కించుకునేందుకు పోటీ పడుతున్న చిత్రాల జాబితాను ‘సైమా’ టీమ్‌ తాజాగా విడుదల చేసింది. 2023లో రిలీజైన సినిమాలకు ఈ అవార్డ్స్‌ దక్కనున్నాయి. టాలీవుడ్‌ నుంచి నాని నటించిన దసరా సినిమా అత్యధికంగా 11 విభాగాల్లో పోటీపడుతుంది. తమిళ్‌ నుంచి జైలర్ 9 విభాగాల్లో సత్తా చాటుతుంది. మలయాలళం నుంచి టొవినో థామస్‌ 2018,  దర్శన్‌ నటించిన కాటేర (కన్నడ) 8 విభాగాల్లో రేసులో ఉన్నాయి. 

సైమా ఛైర్‌పర్సన్‌ బృందాప్రసాద్‌ మీడియా సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు.  వేడుకలకు స్పాన్సర్​గా ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ నెక్సా వ్యవహరించనుందని ఆమె స్పష్టం చేశారు. ఆన్‌లైన్‌ ఓటింగ్‌ ద్వారా విజేతలను ప్రకటిస్తామని సైమా టీమ్‌ తెలిపింది. అభిమానులు తమ ఓట్‌ను సైమా ఫేస్‌బుక్‌ ద్వారా ఉపయోగించుకోవచ్చు.
 

Advertisement
 
Advertisement
Advertisement