ప్రముఖ తమిళ హీరో విజయ్ తనయుడు జాసన్ సంజయ్ డైరెక్టర్‌గా పరిచయమవుతున్న సంగతి తెలిసిందే. సందీప్ కిషన్ హీరోగా తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోన్న ఈ సినిమాకి ‘సిగ్మా’ అనే టైటిల్ ఖరారు చేశారు మేకర్స్. ఫరియా అబ్దుల్లా, రాజు సుందరం, అన్బు థాసన్, యోగ్ జాపీ, సంపత్ రాజ్, కిరణ్ కొండ, మహాలక్ష్మి, సుదర్శనన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. లైకా ప్రోడక్షన్స్ పై సుభాస్కరన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘సిగ్మా’ అనే టైటిల్ ఫిక్స్ చేసి, ఫస్ట్ లుక్‌పోస్టర్ విడుదల చేశారు. బంగారం, నోట్ల కట్టల మధ్య కూర్చొని చేతికి బ్యాండేజ్ కడుతున్నట్లు కనిపించారు సందీప్.
జాసన్ సంజయ్ మాట్లాడుతూ–‘‘యాక్షన్, అడ్వెంచర్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న చిత్రం ‘సిగ్మా’. ఈ టైటిల్, కాన్సెప్ట్ ‘సిగ్మా’ అనే స్వతంత్ర, ధైర్యవంతమైన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది. ట్రెజర్ హంట్, హీస్ట్, కామెడీ అంశాల మేళవింపుతో ఈ సినిమా ప్రేక్షకులకు థ్రిల్లింగ్ అనుభూతిని అందిస్తుంది. ఒక పాట చిత్రీకరణ మిగిలి ఉంది. త్వరలోనే పోస్ట్‌ప్రోడక్షన్ ప్రారంభించి వేసవి ప్రారంభంలో సినిమా విడుదల చేయనున్నాం’’ అని తెలిపారు. ‘‘తొలి సినిమా దర్శకునిగా జేసన్ సంజయ్ 65 రోజుల్లో 95శాతం షూటింగ్ పూర్తి చేయడమంటే అసాధారణ విజయమే’’ అన్నారు లైకాప్రోడక్షన్స్ సీఈఓ తమిళ్ కుమారన్. ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమెరా: కృష్ణన్ వసంత్.


