ఐదేళ్ల తర్వాత విడుదల కానున్న సిద్ధూ జొన్నలగడ్డ సినిమా | Siddhu Jonnalagadda's Krishna and His Leela Movie Release Date Leaked | Sakshi
Sakshi News home page

ఐదేళ్ల తర్వాత విడుదల కానున్న సిద్ధూ జొన్నలగడ్డ సినిమా

Feb 3 2025 11:53 AM | Updated on Feb 3 2025 12:30 PM

Siddhu Jonnalagadda's Krishna and His Leela Movie Release Date Leaked

సిద్ధూ జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda) హీరోగా నటించిన ‘కృష్ణ అండ్‌ హిజ్‌ లీలా’ (Krishna and His Leela) సినిమా ఫబ్రవరి 14న థియేటర్‌లో విడుదల కానుంది. కరోనా కారణంగా 2020లో ఆహా, నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీ వేదికగా విడుదలైన ఈ చిత్రం యూత్‌ను బాగా ఆకట్టుకుంది. ‘క్షణం’ సినిమాతో టాలీవుడ్‌లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిన దర్శకుడు రవికాంత్‌ పేరపు ఈ యూత్‌ఫుల్‌ చిత్రాన్ని తెరకెక్కించాడు. సురేష్‌ ప్రొడక్షన్స్‌, వయకామ్‌ 18, సంజయ్‌ రెడ్డి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్‌, సీరత్‌ కపూర్‌, షాలినీ వందికట్టి హీరోయిన్లుగా నటించారు. 

ఈ సినిమా విడుదల సమయంలో  హీరో రానా దగ్గుబాటి సోషల్‌మీడియా వేదికగా ప్రమోషన్స్‌ చేశారు. ఇప్పుడు థియేటర్స్‌లో విడుదల సందర్భంగా ఆయన మరోసారి ఈ చిత్రాన్ని ప్రమోట్‌ చేస్తున్నారు. తన సోషల్‌మీడియాలో ఒక ఫన్నీ వీడియోతో సినిమా విడుదల తేదీని ప్రకటించారు.  అయితే, ఈసారి 'ఇట్స్‌ కాంప్లికేటెడ్‌' పేరుతో ఫిబ్రవరి 14  ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. 

 

Advertisement
 
Advertisement
Advertisement