Shyam Singha Roy : నెట్‌ఫ్లిక్స్‌లో శ్యామ్‌ సింగరాయ్‌,ఎప్పటి నుంచంటే..

Shyam Singha Roy OTT Release Date Announced - Sakshi

నాని హీరోగా రాహుల్‌ సాంకృత్యాన్‌ దర్శకత్వంలో వచ్చిన చిత్రం 'శ్యామ్‌ సింగరాయ్‌'. క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్‌ 24న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయం సాధించింది. నాని సరసన కృతిశెట్టి, సాయిపల్లవి జంటగా నటించారు. దేవదాసి పాత్రలో సాయి పల్లవి నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంది. మడోన్నా సెబాస్టియన్‌ కీలక పాత్రలో నటించింది.

కలకత్తా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం అందించగా, నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై ప్రొడక్షన్‌ నెంబర్‌ వన్‌గా వెంకట్‌ బోయనపల్లి నిర్మించారు. తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తుంది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో రేపటి నుంచే(జనవరి21)నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. మరి ఓటీటీలో శ్యామ్‌ సింగరాయ్‌కి ఎలాంటి రెస్పాన్స్‌ వస్తుందన్నది చూడాల్సి ఉంది. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top