సుడిగాలి సుధీర్‌ సినిమా.. ‘లైలం బాబు’గా శివాజీ | Shivaji Look Release From Sudigali Sudheer Hailesso Movie | Sakshi
Sakshi News home page

సుడిగాలి సుధీర్‌ సినిమా.. ‘లైలం బాబు’గా శివాజీ

Jun 30 2026 7:06 PM | Updated on Jun 30 2026 7:13 PM

Shivaji Look Release From Sudigali Sudheer Hailesso Movie

సుడిగాలి సుధీర్‌ హీరోగా ప్రసన్న కుమార్ కోట దర్శకత్వం వహిస్తున్న చిత్రం హైలెస్సో.  వజ్ర వారాహి సినిమాస్ బ్యానర్‌పై శివ చెర్రీ, రవికిరణ్ నిర్మిస్తున్నారు. గ్రామీణ నేపథ్యంతో రూపొందుతున్న ఈ చిత్రంలో కోర్ట్ సినిమాలో తన ఇంటెన్స్ నటనతో ఆకట్టుకున్న శివాజీ ‘లైలం బాబు' అనే పవర్‌ఫుల్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. శివాజీ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

పోస్టర్‌లో నల్లటి దుస్తులు, పంచెకట్టుతో రాతి సింహాసనంపై కూర్చొని, చేతిలో సీసా పట్టుకుని శివాజీ కనిపించిన తీరు ఆయన పాత్రలోని పవర్ ని చూపిస్తోంది. 'లైలం బాబు' పాత్రలో శివాజీ తన కెరీర్‌లోనే అత్యంత పవర్‌ఫుల్ అవతార్‌లో ప్రేక్షకులను అలరించబోతున్నారు. ఈ ఫస్ట్ లుక్ తో సినిమాపై మరింత ఆసక్తి నెలకొంది. ఈ సినిమాలో నటాషా సింగ్, నక్ష శరణ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రముఖ కన్నడ నటి అక్షర గౌడ ఈ కీలక పాత్రలో కనిపించనున్నారు.  మొట్ట రాజేంద్రన్, గెటప్ శ్రీను, బెవర దుహిత శరణ్య ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement