
బాలీవుడ్ హీరో షారుక్‌ఖాన్ , దర్శకుడు సుకుమార్ కాంబినేషన్ లో ఓ సినిమా రూపుదిద్దుకోనుందనే టాక్ ప్రచారంలోకి వచ్చింది. షారుక్‌తో ఓ సినిమా చేసేందుకు టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్రయత్నాలు చేస్తోందని, ఈ దిశగా చర్చలుప్రారంభమయ్యాయని ఫిల్మ్‌నగర్ సమాచారం. ఈ సినిమాకు షారుక్ ఓకే చెబితే, దర్శకుడిగా సుకుమార్‌తో ఈ చిత్రాన్ని ముందుకు తీసుకువెళ్లాలని మైత్రీమూవీ మేకర్స్ అనుకుంటున్నారని టాక్.
మరి.. సుకుమార్, షారుక్‌ఖాన్ కాంబినేషన్ లో సినిమా సెట్ అవుతుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ. ఇదిలా ఉంటే.. ఇటీవల షారుక్‌ఖాన్ ను కలిశారట తమిళ దర్శకుడు వెట్రిమారన్ . ఈ నేపథ్యంలో షారుక్‌ఖాన్ సినిమా ఏ దర్శకుడితో ఉండబోతుందనే చర్చ జరుగుతోంది. ఇక ప్రస్తుతం హిందీ చిత్రం ‘కింగ్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) సినిమా ప్రీ ప్రోడక్షన్ వర్క్స్‌లో బిజీగా ఉన్నారు షారుక్‌ఖాన్ . ఈ ఏడాదిలోనే ఈ సినిమా చిత్రీకరణ ఆరంభం కానుంది.