వాస్తవ ఘటనల క్రైమ్‌ థ్రిల్లర్‌.. ఇప్పుడు ఓటీటీలో! | Sector 36 Movie OTT Streaming Date Locked | Sakshi
Sakshi News home page

వాస్తవ ఘటనల క్రైమ్‌ థ్రిల్లర్‌.. ఇప్పుడు ఓటీటీలో!

Aug 13 2024 12:44 PM | Updated on Aug 13 2024 1:05 PM

Sector 36 Movie OTT Streaming Date Locked

బాలీవుడ్‌ నటుడు విక్రాంత్ మ‌స్సే ఇప్పడు భారతీయ సినీ ప్రేక్షకులకు అందరికీ పరిచయమే.. 12th ఫెయిల్‌ సినిమాలో ఐపీఎస్ సాధించాలనే కోరికతో ఒక యువకుడు పోరాటం సాగిస్తాడు. మ‌నోజ్ కుమార్ శ‌ర్మ పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. ద‌ర్శ‌కుడు విధు వినోద్ చోప్రా కూడా చాలా చక్కగా ఆ చిత్రాన్ని తెరకెక్కించాడు. అయితే, తాజాగా విక్రాంత్‌ మస్సే నటించిన సెక్టార్‌- 36 చిత్రం డైరెక్ట్‌గా ఓటీటీలోకి రానుంది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్‌ అధికారికంగా ప్రకటించింది.

12th ఫెయిల్‌,  ఫిర్‌ ఆయీ హసీన్‌ దిల్‌రుబా అనే చిత్రాలలో నటించి ఫుల్‌ జోష్‌లో ఉన్న విక్రాంత్‌ తన తదుపరి సినిమా సెక్టార్‌ 36తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. క్రైమ్‌ థ్రిల్లర్‌ కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు ఆదిత్య నింబాల్కర్‌ తెరకెక్కించాడు.  వాస్తవ సంఘటనల ఆధారంగా మడోక్‌ ఫిల్మ్స్, జీ స్టూడియోస్‌ సంయుక్తంగా సెక్టార్‌ 36 చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. 

మహానగరాల స్ల‌మ్ ఏరియాలో చిన్న పిల్ల‌ల అదృశ్యం వెన‌కున్న మిస్ట‌రీ ఛేదించే పోలీస్ ఆఫీస‌ర్‌గా విక్రాంత్ మ‌స్సే క‌నిపించ‌బోతున్నాడు. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. సెప్టెంబర్‌ 13న డైరెక్ట్‌గా ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమింగ్‌ కానుంది. ఇదే విషయాన్ని నెట్‌ఫ్లిక్స్‌ అధికారికంగా ప్రకటించింది.  ఈ చిత్రంలో దీపక్‌ డోబ్రియల్‌ కీలక పాత్రలో నటించారు. 

Advertisement
 
Advertisement
Advertisement