నాని సినిమా 'సరిపోదా శనివారం' రన్‌టైమ్‌ ఇదే | Saripodhaa Sanivaaram Movie Runtime Locked | Sakshi
Sakshi News home page

నాని సినిమా 'సరిపోదా శనివారం' రన్‌టైమ్‌ ఇదే

Aug 24 2024 2:44 PM | Updated on Aug 24 2024 3:18 PM

Saripodhaa Sanivaaram Movie Runtime Locked

నాని హీరోగా నటిస్తున్న తాజా పాన్‌ ఇండియా ఫిల్మ్‌ ‘సరిపోదా శనివారం’. వివేక్‌ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రియాంకా అరుల్‌ మోహన్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై డీవీవీ దానయ్య, కల్యాణ్‌ దాసరి నిర్మిస్తున్నారు.  ఆగ‌ష్టు 29న ఈ సినిమా విడుదల కానుంది. ఈ క్ర‌మంలో సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాల్లో చిత్ర యూనిట్‌ బిజీగా ఉంది. అయితే, తాజాగా ‘సరిపోదా శనివారం’ సెన్సార్‌ పూర్తి చేసుకుంది.

భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రం ‘సరిపోదా శనివారం’. ఈ సినిమా సెన్సార్‌ వచ్చేసిందని ఒక వీడియో ద్వారా నాని, ఎస్‍జే సూర్య,ప్రియాంక మోహన్‌  కాస్త డిఫరెంట్‌గా తెలిపారు. సెన్సార్ బోర్డ్ U/A స‌ర్టీఫికెట్ ఇచ్చిందని వారు చెప్పారు. సినిమా రన్‌టైమ్‌ 2 గంట‌ల 35 నిమిషాలు ఉన్నట్లు నాని ప్రకటించారు. అయితే, వెంటనే తెరపైకి ఎస్‌జే సూర్య ఎంట్రీ వ‌చ్చి ప్ల‌స్ 15 మినిట్స్ అంటాడు. దీంతో సినిమా మొత్తం 2 గంట‌ల 50 నిమిషాలు ఉన్నట్లు ప్రకటించారు. 

అంటే సుంద‌రానికి.. కూడా ఇదే ర‌న్ టైం క‌దా అంటూ ఎస్‌జే సూర్య గుర్తు చేసే ప్రయత్నం చేస్తుండగా.. అంటే కాదు ‘సరిపోదా శనివారం’  యాక్షన్‌ ఫిల్మ్‌ అని నాని తనదైన శైలిలో సమాధానమిచ్చారు. ఆ వెంటనే ప్రియాంక ఎంట్రీ ఇచ్చి లవ్‌స్టోరీ కూడా అంటూ కామెంట్‌ చేస్తుంది. ఫన్నీగా సాగిన ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అంటే సుందరానికి, సరిపోదా శనివారం.. రెండు చిత్రాలకు దర్శకుడు వివేక్‌ ఆత్రేయ కావడం విశేషం. వీరిద్దరి కాంబినేషన్‌లో మరోసారి సినిమా రానున్నడంతో ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement