
హారర్ సినిమా 'ద భూతిని' ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయింది. సంజయ్ దత్ (Sanjay Dutt) ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో మౌనీ రాయ్, సన్నీ సింగ్, పాలక్ తివారి కీలక పాత్రలు పోషించారు. సిద్దాంత్ కుమార్ సచ్‌దేవ్ దర్శకత్వం వహించాడు. సంజయ్ దత్‌తో పాటు దీపక్ ముకుత్ నిర్మించారు.
నెలన్నర తర్వాతే ఓటీటీలో రిలీజ్
మే 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మెప్పించలేకపోయింది. తాజాగా జీ5 ద భూతిని ఓటీటీ రిలీజ్ డేట్ ప్రకటించింది. జూలై 18న జీ5లో అందుబాటులోకి రానున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ఓ వీడియో క్లిప్ ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేసింది. సినిమా బాలేదంటే నెల తిరిగేలోపే ఓటీటీలో రిలీజ్ చేస్తారు. కానీ ఈ చిత్రాన్ని మాత్రం నెలన్నర గ్యాప్ తర్వాతే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులోకి తెస్తున్నారు.
సినిమాలు
సంజయ్ దత్ విషయానికి వస్తే.. బాలీవుడ్‌లో హీరోగా, విలన్‌గా అనేక సినిమాలు చేశాడు. డబుల్ ఇస్మార్ట్ చిత్రంతో తెలుగులోనూ గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం అఖండ 2 మూవీ చేస్తున్నాడు. ఈయన కీలక పాత్రలో నటించిన ది రాజా సాబ్ డిసెంబర్ 5న విడుదల కానుంది. ఈయన హిందీలో యాక్ట్ చేసిన ధురంధర్ మూవీ కూడా అదే రోజు (డిసెంబర్ 5నే) రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించారు. దీంతో తన రెండు సినిమాలు ఒకేరోజు విడుదల కాకూడదని కోరుకుంటున్నాడు సంజయ్.
Pyaar, panic, aur ek possessive bhootnii — jab bhootnii takrayegi baba se, shuru hoga full-on madness! #TheBhootnii premieres on 18th July, 8 pm, on #ZEE5 & #ZEECinema#TheBhootniiOnZEE5 pic.twitter.com/SmzceTDH6j
— ZEE5Official (@ZEE5India) July 10, 2025
చదవండి: యాంకరింగ్‌లో సిండికేట్.. ఈవెంట్లు చేస్తానో, లేదో?: ఉదయభాను