
ఉదయభాను (Udaya Bhanu).. ఒకప్పుడు తెలుగులో టాప్ యాంకర్. ఏ షో చూసినా ఆమె గొంతే వినిపించేది. ఏ ఈవెంట్‌కు వెళ్లినా ఆవిడ హడావుడే కనిపించేది. బుల్లితెరపై సెటిలవ్వడానికి ముందు సినిమాలు కూడా చేసింది. అప్పట్లో టాలీవుడ్‌లో తోపు యాంకర్‌గా వెలుగొందిన ఉదయభాను తర్వాత సడన్‌గా తెరపై కనుమరుగైపోయింది.
తొక్కేశారంటూ భావోద్వేగం
గతేడాది ఓ సభలో తన కెరీర్‌ను తొక్కేశారని ఎమోషనలైంది. టీవీలో కనిపించి ఐదు సంవత్సరాలైందని పేర్కొంది. అయినా అలుపెరగని ప్రయత్నాలు చేయడం వల్లే ఇంకా నిలబడ్డానంది. ఎన్ని కుట్రలు చేసినా ప్రజల మనసులో నుంచి తనను తుడిపేయలేరని చెప్పుకొచ్చింది. తాజాగా మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేసింది ఉదయభాను. సుహాస్ హీరోగా నటించిన ఓ భామ అయ్యో రామ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ఉదయభాను వ్యాఖ్యాతగా వ్యవహరించింది.
టీవీ ఇండస్ట్రీలో సిండికేట్
ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన దర్శకుడు విజయ్ కనకమేడల.. యాంకర్‌ను చూసి సర్‌ప్రైజ్ అయ్యాడు. అదే విషయం మైక్ అందుకుని మాట్లాడుతూ.. చాలారోజుల తర్వాత ఉదయభాను మళ్లీ ఈవెంట్స్ చేస్తున్నారు. థాంక్యూ అన్నాడు. వెంటనే ఉదయభాను కలగజేసుకుంటూ.. ఇదొక్కటే చేశానండి. మళ్లీ చేస్తానన్న గ్యారెంటీ లేదు. రేపే ఈవెంట్ ఉంది, చేయాలనుకుంటాం. కానీ, ఆరోజు వచ్చాక ఈవెంట్ మన చేతిలో ఉండదు. అంత పెద్ద సిండికేట్ ఎదిగింది.
ఉన్నదున్నట్లు చెప్తా..
నా మనసులో ఉన్న నిజమే చెప్పాను. సుహాస్ మా బంగారం కాబట్టి చేయగలిగాను అని పేర్కొంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఉదయభానుకు యాంకరింగ్ చేయాలన్న ఆసక్తి ఉన్నప్పటికీ తనకు ఈవెంట్లు ఇవ్వడం లేదా? తనవరకు అవకాశాలను వెళ్లనివ్వడం లేదా? అని నెటిజన్లు రకరకాలుగా చర్చిస్తున్నారు. సిండికేట్ అన్న పెద్ద పదం వాడిందంటే తనను కావాలనే టీవీ ఇండస్ట్రీ నుంచి సైడ్ చేశారని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
చదవండి: మాజీ డిప్యూటీ కలెక్టర్‌ను సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న నటి