
నటి, దర్శకురాలు ఆయేషా సుల్తానా (Aisha Sultana) సీక్రెట్‌గా పెళ్లి చేసుకుంది. మాజీ డిప్యూటీ కలెక్టర్ హర్షిత్ సైనిని వివాహమాడింది. జూన్ 20న ఢిల్లీలో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నట్లు తాజాగా వెల్లడించింది. హర్షిత్ గతంలో లక్షద్వీప్‌లోని అండ్రొట్ అండ్ అగట్టి జిల్లాకు డిప్యూటీ కలెక్టర్‌గా పని చేశారు. తన పెళ్లి గురించి తాజా ఇంటర్వ్యూలో ఆయేషా మాట్లాడుతూ.. మేము రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాం. డిసెంబర్‌లో అమ్మ ఉమ్రా యాత్రకు వెళ్లొస్తానంది. ఆమె తిరిగొచ్చాక అదే నెలలో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేస్తాం.
వాట్సాప్‌లో లీకైంది
అప్పటివరకు మా పెళ్లి విషయం ఎవరికీ చెప్పకూడదనుకున్నాం.. కానీ వాట్సాప్ గ్రూప్‌లో లీకైపోయింది. హర్షిత్‌తో నా స్నేహం ప్రేమగా మారడానికి ఎక్కువ సమయం పట్టలేదు. అలా అని మేమెన్నడూ ఐ లవ్యూ చెప్పుకోలేదు. మా ఇద్దరి ఆలోచనలు ఒకటే కావడంతో మాకు తెలియకుండానే ప్రేమలో పడిపోయామంతే! మా పెళ్లి కూడా హడావుడిగా జరిగిపోయింది. ఆయన ఓ పని మీద వచ్చినప్పుడు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాం. సంతకాలు పెట్టగానే నేను ఇంటికి వెళ్లిపోయాను. తను తన డ్యూటీకి వెళ్లిపోయాడు అని చెప్పుకొచ్చింది.

అయితే ఈ పెళ్లిపై విమర్శలు వస్తున్నాయి. కారణం.. ఆయేషా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. లక్షద్వీప్‌కు చెందిన ఈమె తన ప్రాంతంలోని సమస్యల పట్ల గొంతెత్తి ప్రశ్నిస్తుంటుంది. లక్షద్వీప్‌లో ముస్లిం జనాభా ఎక్కువగా ఉందని, దీన్ని మార్చడానికి బీజేపీ ప్రయత్నిస్తోందంటూ ఆ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించింది. ఇప్పుడామె మరో వర్గానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడంతో నెట్టింట తనను ట్రోల్స్ చేస్తున్నారు.
సినీ కెరీర్
మలయాళ మూవీ ఫ్లష్‌తో దర్శకురాలిగా వెండితెరకు పరిచయమైంది ఆయేషా. కెట్టియోలను ఎంటె మలాఖా చిత్రానికి అసోసియేట్ డైరెక్టర్‌గా పని చేసింది. ప్రస్తుతం 124 ఏ అనే సినిమాను డైరెక్ట్ చేస్తోంది. అయితే జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ సినిమాకు ఎదురవుతున్న ఆటంకాలను చూసి ప్రస్తుతానికి తన ప్రాజెక్టును తాత్కాలికంగా ఆపేసింది.