గతంలో నేను తప్పు చేసిన మాట నిజమే: సమంత | Samantha Admits To Mistake Of Endorsing Unhealthy Products | Sakshi
Sakshi News home page

Samantha: అప్పుడు పొరపాటు.. ఇప్పుడు పశ్చాత్తాపం

Jun 29 2024 10:14 AM | Updated on Jun 29 2024 10:22 AM

Samantha Admits To Mistake Of Endorsing Unhealthy Products

హీరోయిన్ సమంత తప్పు ఒప్పుకొంది. తాను గతంలో పొరపాట్లు చేసిన మాట వాస్తవమేనని చెప్పింది.  కానీ ఇప్పుడు మాత్రం అలా అస్సలు చేయడం లేదని క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం సినిమాలేం చేయకుండా ఉన్న సమంత.. ఏ తప్పు విషయమై ఎక్కడ మాట్లాడింది.

(ఇదీ చదవండి: పెళ్లయిన ఐదురోజులకే ఆస్పత్రిలో హీరోయిన్ సోనాక్షి.. ఏమైంది?)

సమంత తెలుగు హీరోయిన్‌గా బోలెడంత స్టార్‌డమ్ సంపాదించుకుంది. పెళ్లి తర్వాత సినిమాలు కొనసాగించింది. ఓవైపు నాగచైతన్యతో విడాకులు, మరోవైపు మయోసైటిస్ అనే ప్రాణాంతక వ్యాధి బారిన పడటంతో కొన్నాళ్లు సినిమాలకు దూరమైంది. చికిత్స కోసం విదేశాలకు వెళ్లొచ్చింది. ప్రస్తుతం ఆరోగ్యానికి సంబంధించిన పాడ్ కాస్ట్ వీడియోలు చేస్తూ నెటిజన్లకు అవగాహన కల్పిస్తోంది.

రీసెంట్‌గా ఓ నెటిజన్ సమంతని ప్రశ్నించాడు. 'ఇప్పుడు ఇవన్నీ బాగానే చెబుతున్నారు. కానీ గతంలో మీరే అనారోగ్యకరమైన బ్రాండ్స్‌ని ప్రమోట్ చేశారు కదా' అని అడగ్గా.. 'గతంలో నేను తప్పులు చేసిన మాట వాస్తవమే. కానీ అవన్నీ పూర్తిగా తెలియక చేసినవి. ఆ తర్వాత పూర్తిగా వాటికి ప్రమోషన్స్ చేయడం ఆపేశా. ఇప్పుడు ఏదైతే చేస్తున్నానో వాటి గురించి మాత్రమే చెబుతున్నా' అని సమంత సమధానమిచ్చింది. ఏదేమైనా సమంతలో ఇప్పుడు ఆరోగ్యం పట్ల పశ్చాత్తపం కనిపిస్తోంది.

(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న మరో టాలీవుడ్ హీరోయిన్.. ఫొటోలు వైరల్)

Advertisement
 
Advertisement
Advertisement