
బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ నటించిన తాజా చిత్రం సితారే జమీన్ పర్. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజైంది. ఈ సినిమాను చూసేందుకు మరో స్టార్ హీరో సల్మాన్ ఖాన్ స్పెషల్ షోకు హాజరయ్యారు. అయితే ఈ మూవీ వీక్షించేందుకు అమిర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ కూడా వచ్చాడు. థియేటర్ వద్ద అదే సమయంలో సల్మాన్ ఖాన్ దగ్గరికి వచ్చేందుకు జునైద్ ఖాన్ యత్నించాడు. అయితే అతన్ని గుర్తుపట్టని బాడీగార్డ్స్ ఒక్కసారిగా పక్కకు తోసేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్టార్ హీరో కుమారుడిని కూడా గుర్తు పట్టలేరా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు గతంలో విక్కీ కౌశల్‌తో ఇలాంటి సంఘటన జరిగిన క్షణాన్ని గుర్తు చేసుకున్నారు. 2023 ఐఫా అవార్డుల సమయంలో విక్కీ కౌశల్.. సల్మాన్ ఖాన్‌ను పలకరించడానికి ప్రయత్నించాడు. ఆ సమయంలో అతని గార్డులు వెంటనే విక్కీ కౌశల్‌ను పక్కకు నెట్టారు.
మరోవైపు అమిర్ ఖాన్- రీనా దత్తాల కుమారుడైన జునైద్ ఖాన్ 2024లో మహారాజ్ చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం ఏక్ దిన్ అనే చిత్రంలో కనిపించనున్నాడు. ఈ మూవీతో సాయి పల్లవి బాలీవుడ్ అరంగేట్రం చేయనుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ సంవత్సరం చివరి నాటికి విడుదలయ్యే ఛాన్స్ ఉంది. అయితే ఈ ఏడాది ఖుషీ కపూర్‌తో కలిసి నటించిన లవ్‌యాపా చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది. ఈ చిత్రం తర్వాత జునైద్ ఖాన్‌ను దారుణంగా ట్రోల్ చేశారు.
#SalmanKhan security 🤣 #JunaidKhan pic.twitter.com/cWXbxgxVaw
— $@M (@SAMTHEBESTEST_) June 20, 2025