విడాకుల తర్వాత మాజీ భర్త గురించి సైంధవి పోస్ట్‌.. అభినందిస్తున్న ఫ్యాన్స్‌ | Saindhavi Comments On GV Prakash Kumar After Divorce | Sakshi
Sakshi News home page

విడాకుల తర్వాత జివి ప్రకాష్‌ గురించి సైంధవి పోస్ట్‌.. అభినందిస్తున్న ఫ్యాన్స్‌

Nov 23 2024 1:33 PM | Updated on Nov 23 2024 3:53 PM

Saindhavi Comments On GV Prakash Kumar After Divorce

 విడాకుల తర్వాత కోలీవుడ్‌ స్టార్‌ సంగీత దర్శకుడు జివి ప్రకాష్‌, గాయని సైంధవి మరోసారి ఒక వేదికపై కలవనున్నారు. ఈ ఏడాది ప్రారంభంలోనే వారిద్దరూ విడిపోతున్నట్లు ప్రకటించడంతో అభిమానులు ఆశ్చర్యపోయారు. సుమారు 11 ఏళ్ల పాటు కలిసి జీవించిన వారు తమ వైవాహిక బందానికి వీడ్కోలు పలికారు. బాల్యం నుంచే వారిద్దరూ మంచి స్నేహితులు. అలా 2013లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారి ప్రేమకు గుర్తుగు అన్వి అనే కూతురు కూడా ఉంది.

సింగర్‌ సైంధవి తాజాగా తన సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన పోస్ట్‌ నెట్టింట వైరల్‌ అవుతుంది. తన మాజీ భర్తకు సంబంధించిన సంగీత కచేరీ గురించి ఆమె ఒక వీడియో పోస్ట​్‌ చేశారు. గతంలో ఎన్నో చిత్రాలకు కలిసి పనిచేసిన వీరిద్దరూ మరోసారి ఒక మ్యూజిక్‌ ప్రోగ్రాం కోసం కలిసి పనిచేయబోతున్నారు. డిసెంబర్‌ 7న మలేషియాలో జరిగే సంగీత కచేరి కార్యక్రమంలో వారిద్దరూ కలిసి కనిపించనున్నారు. 

దీంతో అభిమానులు సంతోషించడమే కాకుండా సైంధవిని అభినందిస్తున్నారు. వివాదాలను పక్కనపెట్టి వృత్తిరిత్యా జివి ప్రకాష్‌తో కలిసి పనిచేయడం అభినందించాల్సిన విషయం అంటూ కామెంట్లు చేస్తున్నారు. విడాకుల తర్వాత కూడా స్నేహం అనే చర్య తమ పరిపక్వతను తెలియజేస్తోందని సోషల్ మీడియాలో పలువురు కొనియాడారు. జి.వి.ప్రకాష్ సంగీతం అందించిన ఈ మధ్యనే విడుదలై ఘనవిజయం సాధించిన ‘అమరన్’ సినిమాలోని ‘గానవే’ పాటను సైంధవి పాడడం గమనార్హం.

విడాకుల సమయంలో కూడా జివి ప్రకాష్ గురించి సైంధవి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. జి.వి.ప్రకాష్ తనకు స్కూల్‌ నుంచే మంచి స్నేహితుడని ఆమె తెలిపింది. అలా 24 ఏళ్లుగా స్నేహితులుగా ఉన్నామని గుర్తుచేసింది. విడాకుల తర్వాత అదే స్నేహంతో ప్రయాణం చేస్తామని ఆమె తెలిపింది. దానిని సైంధవి పాటిస్తున్నట్లు నెటిజన్లు తెలుపుతున్నారు.   ప్రభాస్‌ చిత్రం 'డార్లింగ్‌' సినిమాలో 'ఇంకా ఏదో' అనే పాటతో జివి ప్రకాష్‌ తెలుగు వారికి బాగా దగ్గరయ్యాడు. 

Advertisement
 
Advertisement
Advertisement