రెండు నెలల క్రితం 'ఓజీ' సినిమాతో సక్సెస్ అందుకున్న తెలుగు దర్శకుడు సుజీత్. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ ఫొటోలు పోస్ట్ చేశాడు. ఏకంగా దిగ్గజ సచిన్‌తో తాను పనిచేసినట్లు చెప్పుకొచ్చాడు. అలా అన్నీ కలిసొచ్చాయని రాసుకొచ్చాడు. ఇంతకీ ఏంటి విషయం?
(ఇదీ చదవండి: 'ఆర్యన్' రివ్యూ.. థ్రిల్లర్ సినిమా ఎలా ఉంది?)
రన్ రాజా రన్, సాహో, ఓజీ సినిమాలతో టాలీవుడ్ స్టార్ దర్శకుల్లో ఒకడిగా మారిపోయాడు. ప్రస్తుతం నానితో ఓ డార్క్ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ తీస్తున్నాడు. చాన్నాళ్ల క్రితమే ప్రకటించారు గానీ కొన్నిరోజుల క్రితమే అధికారికంగా పూజా కార్యక్రమంతో లాంచ్ చేశారు. ప్రస్తుతం నాని 'ప్యారడైజ్' చేస్తున్నాడు. ఇది పూర్తయిన తర్వాత సుజీత్ దర్శకత్వంలో నటిస్తాడు.
మరి అంతలోపు ఖాళీగా ఉండటం ఎందుకు అనుకున్నాడేమో గానీ సుజీత్.. కమర్షియల్ యాడ్ షూట్ తీశాడు. ఓ పెయిటింగ్ సంస్థకు సంబంధించిన యాడ్ ఇది కాగా.. ఇందులో దిగ్గజ సచిన్ టెండూల్కర్ యాక్ట్ చేశారు. గతవారం విదేశాల్లో దీన్ని చిత్రీకరించారు. ఆ షూటింగ్ జ్ఞాపకాలని సుజీత్ ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తన ఆనందాన్ని పంచుకున్నాడు.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి సైకలాజికల్ హారర్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్)



