Renu Desai Again Comments On Pawan Kalyan - Sakshi
Sakshi News home page

Renu Desai: అప్పట్లో పవన్‌ అభిమానులు దారుణంగా తిట్టారు.. ఇప్పుడూ అంతే: రేణుదేశాయ్‌

Aug 17 2023 8:32 AM | Updated on Aug 17 2023 8:58 AM

Renu Desai Again Comments On Pawan Kalyan - Sakshi

సినీ హీరో పవన్‌ కల్యాణ్‌ మాజీ భార్య రేణుదేశాయ్‌ ప్రస్థుతం సోషల్‌మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నారు. కొద్దిరోజుల క్రితం తన విడాకుల విషయం, పవన్‌ గురించి ఆమె పలు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆమె టార్గెట్‌గా కొందరు సోషల్‌ మీడియా ద్వారా కామెంట్లు పెడుతున్నారని రేణుదేశాయ్‌ తెలుపుతుంది.

తాజాగ ఇదే వివాదంపై ఆమె ఇలా స్పందించారు 'నా విడాకుల విషయంలో నా మాజీ భర్త ఎలా మోసం చేశాడనే వాస్తవాన్ని గతంలో చెప్పినప్పుడు ఆయన అభిమానులు చాలా దారుణంగా అబ్యూస్ పదాలతో తిట్టారు. ఇప్పుడు, దేశ పౌరురాలిగా నేను అతనికి (పవన్‌) అనుకూలంగా కొన్ని మాటలు మాట్లాడినప్పుడు, అతన్ని ద్వేషించేవారు ఇప్పుడు నన్ను దుర్భాషలాడుతున్నారు.

(ఇదీ చదవండి: విలన్‌గా ధోని.. కాంబినేషన్‌ సెట్‌ చేసిన స్టార్‌ డైరెక్టర్‌)

విడాకుల విషయంలో నా మాజీ భర్త గురించి అప్పట్లో నేను మాట్లాడింది నిజం. ఆరోజు అలా మాట్లాడినందుకు కొందరి నుంచి డబ్బు తీసుకున్నానని పవన్‌ అభిమానులు ఆరోపించారు. అంతేకాకుండా సోషల్‌మీడియా ద్వారా నన్ను దూషించారు కూడా... ఇప్పుడు కూడా మళ్లీ అలాంటిదే నా విషయంలో జరుగుతుంది. నా మాజీ భర్తకు అనుకూలంగా ఉండే వ్యక్తులు నాకు డబ్బు ఇచ్చారని కొందరు ఆరోపిస్తున్నారు. అందులో నిజం లేదు.

నా మాజీ భర్త గురించి నేను అప్పుడు,ఇప్పుడు రెండు సందర్భాల్లోనూ నిజాన్నే తెలిపాను. అతనితో ప్రేమలో పడి నిజం మాట్లాడినందుకు నేను చెల్లించాల్సిన మూల్యం ఇదేనని అనుకుంటున్నా. ఇది నా విధి అయితే, అలాగే ఉండనీయండి. దయచేసి నాపై దుర్భాషలాడకండి.' అని ఆమె కోరారు. దీంతో ఆమె చేసిని ఈ కామెంట్లు ఒక్కసారిగా వైరల్‌ అవుతున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement