MS Dhoni Set To Make Movie Debut With Thalapathy Vijay - Sakshi
Sakshi News home page

MS Dhoni: విలన్‌గా ధోని.. కాంబినేషన్‌ సెట్‌ చేసిన స్టార్‌ డైరెక్టర్‌

Aug 17 2023 6:47 AM | Updated on Aug 17 2023 8:22 AM

MS Dhoni To Make Debut With Vijay Movie  - Sakshi

క్రేజీ కాంబినేషన్లకు సెట్‌ చేయడంలో దర్శకుడు వెంకట్‌ప్రభు ఘనుడనే చెప్పాలి. చిన్న నటుల నుంచీ స్టార్‌ హీరోల వరకూ చిత్రాలను చేసి హిట్స్‌ ఇచ్చిన దర్శకుడీయన. ఆ మధ్య నటుడు అజిత్‌, అర్జున్‌లో మంగాత్తా చిత్రం చేసి సక్సెస్‌ అయిన వెంకట్‌ప్రభు ఇటీవల శింబు హీరోగా మానాడు చిత్రంతో మరో సంచలన విజయాన్ని అందుకున్నారు. తాజాగా దళపతి విజయ్‌ హీరోగా చిత్రం చేయడానికి సిద్ధం అవుతున్నారు. ఇది విజయ్‌ 68వ చిత్రం అన్నది గమనార్హం.

ప్రస్తుతం లియో చిత్రాన్ని పూర్తి చేసిన విజయ్‌ తదుపరి నటించేది వెంకట్‌ప్రభు దర్శకత్వంలోనే. ఏజీఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే నెలలో సెట్‌ పైకి వెళ్లనున్నట్లు సమాచారం. కాగా ఇందులో విజయ్‌ సరసన నటి జ్యోతిక నటించనున్నట్లు ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ క్రేజీ చిత్రంలో ప్రతి నాయకుడి పాత్రలో భారతీయ క్రికెట్‌ మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌.ధోనీ నటించనున్నారనే ప్రచారం జోరందుకుంది. ఇందులో నిజమెంత అన్నది తెలియాల్సి ఉంది.

కాగా ఇటీవలే చిత్ర నిర్మాణ రంగంలోకి ప్రవేశించిన ధోని నటుడు హరీశ్‌కల్యాణ్‌ హీరోగా ఎల్‌జీఎం అనే చిత్రాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. కాగా ఈ చిత్ర మీడియా సమావేశంలో ధోని హీరోగా యాక్షన్‌ ఓరియంటెండ్‌ చిత్రాన్ని చేస్తారని ఆయన సతీమణి సాక్షి ధోని పేర్కొన్నారు. అలాంటిది ఇప్పుడు విజయ్‌కు విలన్‌గా నటించనున్నారనే ప్రచారం ఆసక్తిని రేకెత్తిస్తోంది. కాగా ఇంకా పేరు ఖరారు చేయని విజయ్‌ 68వ చిత్రానికి యువన్‌శంకర్‌రాజా సంగీతాన్ని అందించనున్నారు. కాగా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెలువడే అవకాశం ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement