గత కొన్నాళ్లగా రవితేజ వరస సినిమాలు చేస్తున్నాడు కానీ ఒక్కటి కూడా సరైన హిట్ కావట్లేదు. ప్రస్తుతం 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' అనే ఫ్యామిలీ కామెడీ మూవీలో నటిస్తున్నాడు. సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అందుకు తగ్గట్లే గ్లింప్స్, ఓ పాట రిలీజ్ చేశారు. రవితేజ మార్క్‌లోనే ఈ మూవీ కూడా ఉండనుందనిపిస్తోంది. ఇప్పుడు సడన్‌గా ఓ రూమర్ తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఇందులో నిజమెంత?
(ఇదీ చదవండి: 'కాంతార'పై కామెడీ.. క్షమాపణ చెప్పిన స్టార్ హీరో)
రవితేజ తర్వాత సినిమా ఏది అనేది ఇంకా ఫిక్స్ కాలేదు. శివ నిర్వాణతో పాటు పలువురి దర్శకులు పేర్లు వినిపిస్తున్నప్పటికీ ఎవరనేది క్లారిటీ రావాల్సి ఉంది. అయితే ఈ హీరో నెక్స్ట్ మూవీలో ఏకంగా ఆరుగురు హీరోయిన్లు ఉండనున్నారనే.. ఉదయం నుంచి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. చాలామంది ఇది నిజమేనేమో అనుకున్నారు. కానీ ఇదంతా ఫేక్ అని స్పష్టత వచ్చేసింది. ఈ రూమర్‌ని ఎవరు ఎందుకు వైరల్ చేశారో మరి?
గత నెలలో 'మాస్ జాతర' సినిమాతో రవితేజ.. ప్రేక్షకుల ముందుకొచ్చాడు. థియేటర్లలో రిలీజైనప్పుడు ఫ్లాప్ టాక్ వచ్చింది. రీసెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన తర్వాత అదే రెస్పాన్స్ వచ్చింది. అలానే రవితేజతో చేసి హీరోయిన్ల విషయంలోనూ అప్పుడప్పుడు కొన్ని ట్రోల్స్ వస్తుంటాయి. ఇప్పుడు కూడా కావాలనే ఎవరో ఈ రూమర్ స్ప్రెడ్ చేశారనిపిస్తుంది.
(ఇదీ చదవండి: 'ఆంధ్ర కింగ్ తాలూకా'.. ఎందుకు ఇలాంటి పరిస్థితి?)


