
రష్మిక మందన్నా(Rashmika Mandanna).. ఈ పేరు ఇప్పుడు కుర్రకారుకు తారక మంత్రంగా మారింది. కన్నడంలో ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఈ భామ ఇప్పుడు జాతీయ స్థాయి క్రష్ హీరోయిన్‌గా మారారు. కన్నడ చిత్ర పరిశ్రమలో నటిగా పయనాన్ని మొదలెట్టినా, ఈమెను క్రేజీ హీరోయిన్‌ను చేసింది మాత్రం తెలుగు చిత్ర పరిశ్రమనే అనేది ఎవరూ కాదనలేని నిజం. అక్కడ ఛలో చిత్రంతో కెరీర్‌ను ప్రారంభించి ఇటీవల విడుదలయిన కుబేర వరకూ పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి అగ్ర కథానాయకిగా రాణిస్తున్నారు. అదే విధంగా తమిళంలోనూ సుల్తాన్, వారిసు చిత్రాల్లో మెరిశారు. ఇకపోతే గుడ్‌బై అంటూ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన్నా అక్కడ తొలి చిత్రం యావరేజ్ అనిపించుకున్నా, ఆ తరువాత నటించిన యానిమల్ చిత్రం సూపర్‌హిట్ అయ్యింది. రణ్‌బీర్ కపూర్‌కు జంటగా నటించిన యానిమల్ చిత్రం గత 2023 డిశంబర్ నెలలో తెరపైకి వచ్చి రక రకాల విమర్శనలను ఎదుర్కొంది.
ముఖ్యంగా నటుడు రణ్‌బీర్ కపూర్ పాత్రపై మాత్రం ఘోరంగా విమర్శలు ట్రోల్ అయ్యాయి. ఆయన ఎక్కువగా సిగరెట్స్ కాల్చే సన్నివేశాలపై తీవ్ర విమర్శలు దొర్లాయి. అయితే వసూళ్లను మాత్రం రికార్డు స్థాయిలో రాబట్టుకుంది. దీని గురించి ఇటీవల ఒక భేటీలో స్పందించిన నటి రష్మిక మందన్నా తాను ఆ చిత్రాన్ని చిత్రంగానే చూశానన్నారు. చిత్రంలో హీరో సిగరెట్టు తాగితే అది ఇతరులను సిగరెట్లు తాగే విధంగా ప్రేరేపిస్తున్నాయి అని అంటున్నారని, సమాజంలో ప్రజలు సిగరెట్స్ తాగడం అనేది సర్వ సాధారణం అని పేర్కొన్నారు.
అయితే తాను మాత్రం సినిమాల్లో కూడా సిగరెట్స్ తాగే విధంగా నటించనని చెప్పారు. ఒకవేళ అలాంటి పాత్రలు వస్తే.. సినిమానే వదిలేస్తానని అన్నారు. ఇకపోతే చిత్రాన్ని చిత్రంగానే చూడమని, ఇతరులను చిత్రం చూడమని ఎవరినీ చిత్రం చూడమని వత్తిడి చేయడం లేదని అన్నారు. ఇక్కొక్కరికి ఒక్కో చెడ్డ అలవాటు ఉంటుందని దాన్ని యానిమల్ చిత్రంలో దర్శకుడు చూపించారు అంతే అని నటి రష్మిక మందన్నా పేర్కొన్నారు. అయితే చిత్రం విడుదలై ఏడాదిన్నర పైగా అయినా యానిమల్ చిత్రం విమర్శల నుంచి తప్పించుకోలేకపోతోంది.