మీలో ఒకడు | RaPo22: Ram Pothineni SAGAR Movie First Look Release | Sakshi
Sakshi News home page

మీలో ఒకడు

Dec 7 2024 2:59 AM | Updated on Dec 7 2024 3:05 AM

RaPo22: Ram Pothineni SAGAR Movie First Look Release

‘మీకు సుపరిచితుడు... మీలో ఒకడు... మీ సాగర్‌’ అంటూ రామ్‌ తాజా చిత్రం లుక్‌ విడుదలైంది. రామ్‌ పోతినేని హీరోగా మహేశ్‌బాబు .పి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్‌ ఎర్నేని, రవిశంకర్‌ యలమంచిలి ఓ సినిమా నిర్మిస్తున్న విషయం తెలిసిందే.

ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభమైన సందర్భంగా రామ్‌ చేస్తున్న సాగర్‌ పాత్రను పరిచయం చేసి, లుక్‌ని విడుదల చేశారు. పాత రోజుల హెయిర్‌ స్టయిల్, క్లీన్‌ షేవ్‌తో రామ్‌ వింటేజ్‌ లుక్‌లో కనిపిస్తున్నారు. ఈ హీరోకి ఇది 22వ సినిమా. భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: మధు నీలకందన్, సంగీతం: వివేక్‌–మెర్విన్, సీఈవో: చెర్రీ.

Advertisement
 
Advertisement
Advertisement