యువర్‌ ఫిలిం కాంటెస్ట్‌: ఫైనలిస్టులు వీళ్లే! | Ram Gopal Varma Announces Your Film Contest Finalists | Sakshi
Sakshi News home page

Ram Gopal Varma: ఫైనలిస్టులుగా ఆ ముగ్గురు.. గెలిచేదెవరో?

Published Mon, Jul 1 2024 3:17 PM | Last Updated on Mon, Jul 1 2024 3:38 PM

Ram Gopal Varma Announces Your Film Contest Finalists

కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో దర్శకనిర్మాత రామ్‌గోపాల్‌ వర్మ.. ఆర్జీవీ యువర్‌ ఫిలిం కాంటెస్ట్‌ను ప్రవేశపెట్టాడు. ఈ పోటీకి వివిధ రాష్ట్రాల నుంచి వందలకొద్దీ ఎంట్రీలు వచ్చాయి.  డైరెక్టర్‌ ఛాన్స్‌ కోసం 419 మంది అప్లై చేసుకోగా వాటిని జల్లెడ పట్టి  11 మందిని షార్ట్‌ లిస్ట్‌ చేశారు. వారు తీసిన సన్నివేశాలను యూట్యూబ్‌లో షేర్‌ చేసిన వర్మ.. ఎవరి డైరెక్షన్‌ బాగుందో చెప్పాలంటూ గత నెలలో యూట్యూబ్‌లో పోల్‌ పెట్టాడు. 

సోమవారం నాడు ఈ పోల్‌ ఫలితాలను వెల్లడించాడు. నిరంజన్‌ నాగరాజ, గురుప్రసాద్‌ మనారి, అభిజీత్‌ సాయి రెడ్డిలను ఫైనలిస్టులుగా ప్రకటించాడు. ఇప్పుడీ ముగ్గురిలో ఒకర్ని విజేతలుగా ప్రకటించాల్సిన బాధ్యత మీదేనంటూ మళ్లీ ప్రేక్షకుల నిర్ణయానికే వదిలేశాడు.

వారు తెరకెక్కించిన వీడియోలు చూసి ఎవరి డైరెక్షన్‌ బాగుందో చెప్పాలంటూ యూట్యూబ్‌లో మరో పోల్‌ పెట్టాడు. ఇందులో ఎవరికైతే ఎక్కువ ఓట్లు పడతాయో వారితో వర్మ ఓ సినిమా తీస్తాడు. ఆరు నెలల్లోనే మూవీ తీసి రిలీజ్‌ చేస్తారు. మరి వీరిలో ఎవరు బెస్ట్‌ డైరెక్టర్‌గా గెలిచి సినిమా ఛాన్స్‌ అందుకుంటారో చూడాలి!

 

 

చదవండి: ఈఎమ్‌ఐ కట్టకపోవడంతో షారూఖ్‌ కారు తీసుకెళ్లారు: హీరోయిన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement