
విజయ రామరాజు టైటిల్ రోల్‌లో రూపొందిన స్పోర్ట్స్ డ్రామా ‘అర్జున్ చక్రవర్తి’. విక్రాంత్ రుద్ర దర్శకత్వంలో శ్రీని గుబ్బల నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 29న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా యాంథమ్‌ని విడుదల చేశారు. చిత్ర సంగీతదర్శకుడు విఘ్నేష్ భాస్కరన్ స్వరపరచిన ఈపాటకు విక్రాంత్ రుద్ర సాహిత్యం అందించారు.
దీపక్ బ్లూ, బృథ్వీవ్ సత్యకుమార్, విఘ్నేష్‌పాయ్ ఆలపించారు. విజయ రామరాజు ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌కి సంబంధించిన విజువల్స్ ఈపాటలో కనిపిస్తాయి. ఓ కబడ్డీ ప్లేయర్ నిజ జీవిత కథతో ఈ చిత్రాన్ని రూపొందించారు. ‘‘ఎమోషనల్ కథాంశంతో రూపొందించిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తుందనే నమ్మకం ఉంది’’ అని దర్శక–నిర్మాతలు పేర్కొన్నారు.