థ్రిల్లర్‌ జానర్‌కి సై? | Shiva Nirvana to direct Ravi Teja | Sakshi
Sakshi News home page

థ్రిల్లర్‌ జానర్‌కి సై?

Aug 18 2025 5:35 AM | Updated on Aug 18 2025 5:35 AM

Shiva Nirvana to direct Ravi Teja

‘నిన్ను కోరి’ (2017), ‘మజిలీ’ (2019), ‘ఖుషి’ (2023) వంటి ప్రేమకథా చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన దర్శకుడు శివ నిర్వాణ కాస్త రూట్‌ మార్చి ఓ థ్రిల్లర్‌ కథను సిద్ధం చేసుకున్నారు. ఇటీవల ఈ స్టోరీని హీరో రవితేజకు వినిపించగా ఆయన ఈ సినిమా చేసేందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారట. ఈ థ్రిల్లర్‌ జానర్‌ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మించనుందని ఫిల్మ్‌నగర్‌ సమాచారం.

అయితే ప్రస్తుతం రవితేజ చేతిలో కిశోర్‌ తిరుమల దర్శకత్వంలోని ‘అనార్కలి’ (వర్కింగ్‌ టైటిల్‌), భాను భోగవరపు డైరెక్షన్‌లోని ‘మాస్‌ జాతర’ సినిమాలు ఉన్నాయి. ఈ రెండు సినిమాల చిత్రీకరణలు పూర్తయిన తర్వాత శివ నిర్వాణతో చేయాల్సిన సినిమాపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అలాగే ‘మ్యాడ్, మ్యాడ్‌ 2’ చిత్రాల ఫేమ్‌ కల్యాణ్‌ శంకర్‌ కూడా ఓ సూపర్‌ హీరో జానర్‌లో రవితేజకు కథ వినిపించారు. మరి... రవితేజ ఏ దర్శకుడితో ముందుగా తన సినిమాను సెట్స్‌కు తీసుకువెళ్తారో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్‌ చేయక తప్పదు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement