భర్త మహాశయులకు విజ్ఞప్తి! | Ravi Teja and Kishore Tirumala family entertainer for Sankranti | Sakshi
Sakshi News home page

భర్త మహాశయులకు విజ్ఞప్తి!

Oct 5 2025 12:52 AM | Updated on Oct 5 2025 12:52 AM

Ravi Teja and Kishore Tirumala family entertainer for Sankranti

‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అని అంటున్నారట హీరో రవితేజ. ఈ విజ్ఞప్తి వివరాల కోసం ప్రేక్షకులను వచ్చే సంక్రాంతికి థియేటర్స్‌కి రమ్మంటున్నారు. రవితేజ హీరోగా కిశోర్‌ తిరుమల దర్శకత్వంలో ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి తొలుత ‘అనార్కలి’ అనే టైటిల్‌ను అనుకున్నారు.

కానీ తాజాగా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారని, త్వరలోనే ఈ సినిమా టైటిల్‌ గురించిన అధికారిక ప్రకటన రానుందని సమాచారం. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ కోసమే రవితేజ స్పెయిన్‌ వెళ్లారు. కొంత టాకీ పార్టు, రెండు పాటల చిత్రీకరణ స్పెయిన్‌ లొకేషన్స్‌లో జరుగుతుంది. ఈ షెడ్యూల్‌తో ఈ సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తవుతుంది. ఇక ఈ చిత్రాన్ని సంక్రాంతి సందర్భంగా రిలీజ్‌ చేయనున్నట్లుగా మేకర్స్‌ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement