
అనిరుధ్, హెబ్బా పటేల్ ప్రధానపాత్రల్లో నటిస్తున్న యాక్షన్ అండ్ థ్రిల్లర్ మూవీ ‘మారియో’. ‘నాటకం, తీస్ మార్ ఖాన్’ చిత్రాల ఫేమ్ కల్యాణ్ జి. గోగణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. సిల్వర్ స్క్రీన్‌ప్రోడక్షన్స్, రిజ్వాన్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు నిర్మిస్తున్నాయి.
ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. రాకేందు మౌళి, మౌర్య సిద్ధవరం, యష్నా ముతులూరి, కల్పిక గణేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సాయి కార్తీక్, రాకేందు మౌళి, కెమెరా: ఎంఎన్ రెడ్డి.