
టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ తనయుడు రోషన్ (Roshan) హీరోగా ప్రదీప్ అద్వైతం డైరెక్ట్ చేస్తున్న మూవీ ‘ఛాంపియన్’ (Champion). సుమారు నాలుగేళ్ల తర్వాత రోషన్ మళ్లీ వెండితెరపైకి రానున్నాడు. ఈ క్రమంలో ఛాంపియన్ విడుదల పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. స్వప్న సినిమా, ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్ సంస్థలు సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నాయి. స్పోర్ట్స్ నేపథ్యంలో ఈ సినిమాపై రోషన్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. సుమారు 50కి పైగా కథలను రిజెక్ట్ చేసి ఫైనల్‌గా ఈ స్టోరీని ఆయన ఎంపిక చేసుకున్నాడు. ఆపై ఈ చిత్రాన్ని స్వప్న దత్ నిర్మిస్తుండంతో అంచనాలు బాగానే ఉన్నాయి.

పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కిన ఛాంపియన్ సినిమాను క్రిస్టమస్ సందర్భంగా డిసెంబర్ 25న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ నెటిజన్లను కూడా మెప్పించింది. ఇందులో రోషన్ లుక్ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ఈ మూవీ కోసం రోషన్ మేకోవర్ చాలా కొత్తగా ఉండటంతో ఈసారి భారీ హిట్ కొడతాడని నెటిజన్లు కూడా అభిప్రాయం చెందుతున్నారు.