హలగలి... ఓ చిరస్మరణీయపోరాటం | Halagali movie glimpses released | Sakshi
Sakshi News home page

హలగలి... ఓ చిరస్మరణీయపోరాటం

Aug 18 2025 5:45 AM | Updated on Aug 18 2025 5:45 AM

Halagali movie glimpses released

∙లక్ష్మీ శ్రీనివాస్, సప్తమి గౌడ, డాలీ ధనంజయ, సుకేష్‌ నాయక్, కల్యాణ్‌ చక్రవర్తి

‘‘హలగలి (కర్ణాటకలోని ఓ గ్రామం) అనేది కర్ణాటకలో ఓ గొప్ప ఎమోషన్‌. ఈ కథ వినగానే ఈ సినిమాలో నటించాలనిపించింది. ఈ సినిమా చేయడం నా అదృష్టం. తెలుగు ప్రేక్షకులు నాపై చూపిస్తున్న ప్రేమకి కృతజ్ఞతలు. ఈ సినిమా ప్రేక్షకులకు ఓ గొప్ప అనుభూతినిచ్చేలా ఉంటుంది’’ అని డాలీ ధనంజయ అన్నారు. డాలీ ధనంజయ, సప్తమి గౌడ ప్రధానపాత్రధారులుగా సుకేష్‌ నాయక్‌ దర్శకత్వంలో రూపొందుతున్న హిస్టారికల్‌ మూవీ ‘హలగలి’. 1857లో జరిగిన ఓ వాస్తవ సంఘటనతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

యార్లగడ్డ లక్ష్మీ శ్రీనివాస్‌ సమర్పణలో కల్యాణ్‌ చక్రవర్తి ధూళిపాళ్ల నిర్మిస్తున్న ఈ సినిమా గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా సుకేష్‌ మాట్లాడుతూ – ‘‘ఇది ఒక్క భాగంలో చెప్పే కథ కాదు. ఈ కథ వెనకాల గొప్ప చరిత్ర ఉంది. అందుకే రెండు భాగాలుగా విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ‘‘చరిత్రలో హలగలి అనేది ఒక అధ్యాయం. బ్రిటిష్‌కి వ్యతిరేకంగా జరిగిన చిరస్మరణీయపోరాటం. కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమాను చిత్రీకరిస్తున్నాం’’ అన్నారు కల్యాణ్‌ చక్రవర్తి. ‘‘హలగలి’ మన నేల కథ’’ అని తెలిపారు సప్తమి గౌడ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement