
2022లో అల్లు అర్జున్‌కు దక్కిన గౌరం..
రెండేళ్ల తర్వాత విజయ్ దేవరకొండ, రష్మికలకు ఛాన్స్
టాలీవుడ్ ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న అరుదైన గౌరవం దక్కించుకున్నారు. న్యూయార్క్‌లోని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ (FIA) నిర్వహించిన భారీ పరేడ్‌కు వారిద్దరూ ' గ్రాండ్ మార్షల్'గా వ్యవహరించారు. FIA అనేది అమెరికాలోని భారతీయ ప్రవాసుల కోసం స్థాపించబడిన ప్రముఖ సంస్థ. ఇది 1970లో ప్రారంభమై, ప్రధానంగా న్యూయార్క్, న్యూజెర్సీ, కనెక్టికట్, మాసాచుసెట్స్, రోడ్ ఐలాండ్, న్యూ హాంప్‌షైర్, వెర్మాంట్ మరియు మైన్ రాష్ట్రాల్లో భారతీయ సముదాయాన్ని ప్రాతినిధ్యం వహిస్తుంది. ప్రస్తుతం 43వ గ్రాండ్ మార్షల్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందులో ' గ్రాండ్ మార్షల్'గా పాల్గొన్నవారికి ప్రత్యేక గౌరవం దక్కుతుంది. వారికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కుతుంది.
ప్రపంచంలో అతిపెద్ద భారతీయ పరేడ్ ప్రతి సంవత్సరం న్యూయార్క్‌లో నిర్వహించబడుతుంది. ఇది భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించే ఘనమైన వేడుక. 2025 సంవత్సరానికి గాను, సినీ తారలు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న “గ్రాండ్ మార్షల్స్”గా పాల్గొన్నారు. వీరి హాజరు పరేడ్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్, కాంగ్రెస్ సభ్యులు, ఇతర ప్రముఖులు కూడా పాల్గొన్నారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ప్రోత్సహించడం ఆపై ప్రవాస భారతీయుల ఐక్యతను బలపరచడం వంటి అంశాల్లో గత 42 ఏళ్లుగా FIA పనిచేస్తుంది. 2022లో ఇదే గౌరవాన్ని టాలీవుడ్ నుంచి మొదటిసారి అల్లు అర్జున్ అందుకున్నారు.
#VijayDeverakonda and #RashmikaMandanna, lead the 43rd India Day Parade in New York City as Grand Marshals.@TheDeverakonda @iamRashmika pic.twitter.com/ecxsKwV0NY
— Suresh PRO (@SureshPRO_) August 18, 2025