
మెగా హీరో రామ్ చరణ్ మరో అరుదైన గౌరవం దక్కించుకున్నాడు. లండన్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఇతడి మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించారు. భారత కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం స్వయంగా చరణ్.. తన విగ్రహాన్ని రివీల్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
(ఇదీ చదవండి: హీరో జయం రవి భార్య- ప్రియురాలి మధ్య మాటల యుద్ధం!)
కొన్నిరోజుల క్రితమే కుటుంబంతో కలిసి లండన్ వెళ్లిన రామ్ చరణ్.. ఈరోజు తనకోసం వచ్చిన అభిమానుల్ని కూడా కలిశారు. ఇప్పుడు భార్యతో కలిసి మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియానికి వెళ్లారు. తర్వాత తన మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించాడు. మైనపు విగ్రహంలో చరణ్ తో పాటు అతడి పెట్ డాగ్ కూడా ఉండటం విశేషం.
చరణ్ కెరీర్ విషయానికొస్తే.. చిరుత సినిమాతో హీరో అయ్యాడు. మగధీర మూవీతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాడు. ఆర్ఆర్ఆర్ చిత్రంతో అంతర్జాతీయ గుర్తింపు సంపాదించాడు. కాకపోతే ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన గేమ్ ఛేంజర్ తో ఘోరమైన ఫ్లాప్ అందుకున్నాడు. ప్రస్తుతం పెద్ది మూవీ చేస్తున్నాడు. ఇది వచ్చే ఏడాది మార్చిలో రిలీజ్ కానుంది.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన 'రాబిన్ హుడ్' సినిమా)
Here we gooo…🌟#RamCharanWaxStatue@AlwaysRamCharan x @MadameTussauds pic.twitter.com/4ODzG4zlDT
— Trends RamCharan ™ (@TweetRamCharan) May 10, 2025