పురుషోత్తముడిగా రాజ్‌తరుణ్‌.. ట్రైలర్‌ విడుదల | Raj Tarun's Purushothamudu Trailer Out Now | Sakshi
Sakshi News home page

పురుషోత్తముడిగా రాజ్‌తరుణ్‌.. ట్రైలర్‌ విడుదల

Jul 19 2024 1:42 PM | Updated on Jul 19 2024 2:56 PM

Raj Tarun's Purushothamudu Trailer Out Now

రాజ్‌ తరుణ్‌ హీరోగా రామ్‌ భీమన దర్శకత్వం వహిస్తున్న చిత్రం  ‘పురుషోత్తముడు’. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్‌ను మేకర్స్‌ విడుదల చేశారు.  ఈ చిత్రాన్ని శ్రీ శ్రీదేవి ప్రొడక్షన్స్ బ్యానర్ పై డా.రమేష్ తేజావత్, ప్రకాష్ తేజావత్ ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో హాసిని సుధీర్ హీరోయిన్‌గా పరిచయమవుతున్నారు.

ఆకతాయి, హమ్ తుమ్ చిత్రాలతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న  రామ్ భీమన పురుషోత్తముడు ఇప్పుడు పురుషోత్తముడు చిత్రాన్ని భారీ అంచనాలతో తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, మురళి శర్మ, రమ్య కృష్ణ, బ్రహ్మానందం, ముకేష్ ఖన్నా వంటి స్టార్ కాస్టింగ్ తో రూపొందిన ఈ సినిమా జులై 26న రిలీజ్‌ కానుంది.

కొద్దిరోజులుగా రాజ్‌ తరుణ్‌ పలు వివాదాల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. తనను ప్రేమించి మోసం చేశాడని లావణ్య అనే యువతి పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.  మాల్వీ మల్హోత్రాతో రాజ్‌ తరుణ్‌ ఎఫైర్‌ పెట్టుకున్నాడని లావణ్య తెలిపింది. 'తిరగబడరసామీ' సినిమా సమయంలో వారిద్దరూ ప్రేమించుకున్నారని ఆమె తెలుపుతుంది. ఈ సినిమా కూడా త్వరలో విడుదల కానుంది.

Advertisement
 
Advertisement
Advertisement