
రీసెంట్‌గా అసెంబ్లీ సాక్షిగా నటుడు బాలకృష్ణ.. చిరంజీవిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయమై వెంటనే చిరంజీవి కూడా ఘాటుగా స్పందించారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో చిరంజీవి vs బాలకృష్ణ అన్నట్లు సాగుతోంది. ఇప్పుడు ఈ వివాదంపై ప్రముఖ నటుడు దర్శక నిర్మాత ఆర్. నారాయణమూర్తి స్పందించారు. గత ప్రభుత్వం.. సినిమా వాళ్లని అస్సలు అవమానించలేదని కుండబద్ధలు కొట్టారు.
'ఏపీ అసెంబ్లీలో బాలకృష్ణ కామెంట్స్‌పై చిరంజీవి స్పందన 100 శాతం నిజం. జగన్‌ని కలిసిన వాళ్లలో నేను కూడా ఉన్నాను. జగన్ గవర్నమెంట్ ఎవరినీ అవమానించలేదు. చిరంజీవి ఆధ్వర్యంలో మేము జగన్‌మోహన్‌రెడ్డి గారిని కలిసినప్పుడు ఆయన ఎంతో గౌరవం ఇచ్చారు. గత గవర్నమెంట్ చిరంజీవిగారిని అవమానించారనే ప్రచారం తప్పు. గత గవర్నమెంటు మా సినిమా వాళ్లని అవమానించలేదు. చిరంజీవి గారు నాకు స్వయంగా ఫోన్ చేశారు అది ఆయన సంస్కారం. అందరూ చిరంజీవి నివాసంలో కలిశాం. అనంతరం పరిశ్రమ పెద్దగా చిరంజీవి.. జగన్‌తో మాట్లాడారు'
'చిరంజీవి వల్లే ఆ రోజు సమస్య పరిష్కారం అయింది. ఇంకా ఇండస్ట్రీలో ఉన్న సమస్యలను ప్రస్తుత ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతున్నాను. నేను బాలకృష్ణ గురించి మాట్లాడదల్చుకోలేదు. సినిమా టికెట్ ధరలు పెంచకూడదు. సామాన్యుడికి కూడా వినోదాన్ని పంచేది కేవలం సినిమా మాత్రమే. అలాంటి సినిమా టికెట్ ధరలు పెంచితే సామాన్యుడు ఇబ్బంది పడతాడు. ఆ రోజు మమ్మల్ని జగన్ ఎంతో గౌరవించారు' అని ఆర్.నారాయణ మూర్తి క్లారిటీ ఇచ్చారు.

‘బాలయ్య అంతేసి మాటలన్నా స్పీకర్ పట్టించుకోరా?’