విజయ్‌ దేవరకొండపై రూమర్స్.. స్పందించిన మైత్రి నిర్మాత | Producer Ravi Responds on Vijay Devarakonda Ranabali Movie | Sakshi
Sakshi News home page

Ranabali Movie: విజయ్‌ దేవరకొండపై రూమర్స్.. స్పందించిన మైత్రి నిర్మాత

Jun 26 2026 1:03 PM | Updated on Jun 26 2026 1:59 PM

Producer Ravi Responds on Vijay Devarakonda Ranabali Movie

గత రెండు రోజులుగా హీరో విజయ్ దేవరకొండ రణబాలి మూవీపై రూమర్స్ వినిపిస్తున్నాయి. హీరో విజయ్ నిర్మాతలకు నష్టం కలిగించేలా వ్యవహరిస్తున్నారని సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాజాగా ఈ రూమర్స్‌పై మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత యలమంచిలి రవి స్పందించారు. అలాంటి వార్తలు పూర్తి ఫేక్ అని కొట్టిపారేశారు. షూటింగ్ సమయంలో మాకు ఎలాంటి ఇబ్బందులు రాలేదని వెల్లడించారు. విజయ్ కేవలం పని మీదే శ్రద్ధ పెడతారని రవి క్లారిటీ ఇచ్చారు.

కాగా.. రణబాలి షూట్‌ కోసం విజయ్ ఎక్కువగా కారవాన్లు డిమాండ్ చేయడమే కాకుండా.. అసిస్టెంట్స్‌ కూడా ఎక్కువమంది ఉండాలని కోరాడని వార్తలొచ్చాయి. ఇప్పటికే ఈ విషయంపై విజయ్ టీమ్ కూడా స్పందించింది. ఇలాంటి ఫేక్ న్యూస్ రాసేవారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని ప్రకటన విడుదల చేశారు.

కాగా.. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో రణబాలి మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా కనిపించనుంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. కీలక సన్నివేశాలను రాయలసీమలోని చారిత్రక ప్రాంతాల్లో తెరకెక్కించారు. బ్రిటిష్ కాలం నాటి స్టోరీ కావడంతో అందుకు తగ్గట్టుగానే షూట్‌ చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement