ప్రశాంత్ వర్మ మరో సర్‌ప్రైజ్‌.. ఏకంగా బాహుబలి హీరోతో! | Prasanth varma Latest Pic With Rana Daggubati Goes Viral | Sakshi
Sakshi News home page

Prasanth varma: ప్రశాంత్ వర్మ ప్లానింగ్‌.. మామూలుగా లేదుగా!

Nov 4 2024 6:21 PM | Updated on Nov 4 2024 7:14 PM

Prasanth varma Latest Pic With Rana Daggubati Goes Viral

ఈ ఏడాది బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ డైరెక్టర్‌ ప్రశాంత్ వర్మ. ఆయన తెరకెక్కించిన హనుమాన్‌ సంక్రాంతికి రిలీజై బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా భారీ వసూళ్లు రాబట్టింది. ఈ సక్సెస్‌తో సీక్వెల్‌ రూపొందించే పనిలో బిజీగా ఉన్నారు ప్రశాంత్ వర్మ.

జై హనుమాన్‌ పేరుతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రంలో కన్నడ స్టార్‌, కాంతార ఫేమ్ రిషబ్ శెట్టిని హనుమాన్‌గా పరిచయం చేశారు. ఇటీవల దీపావళి సందర్భంగా ఆయన లుక్‌ను రివీల్ చేశారు. దీంతో సీక్వెల్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు పెరిగాయి. ఇటీవల విడుదలైన జై హనుమాన్‌ థీమ్ సాంగ్‌ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది.

అయితే తాజాగా దర్శకుడు ప్రశాంత్ వర్మ షేర్ చేసిన పిక్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. జై జై  హనుమాన్‌ అని క్యాప్షన్‌ ఇస్తూ రిషబ్‌శెట్టి, రానా దగ్గుబాటి, ప్రశాంత్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌ను ట్యాగ్ చేశాడు. ఈ ఫోటోలో టాలీవుడ్ హీరో రానా కూడా ఉన్నారు. ఇది చూసిన నెటిజన్స్‌.. రానా కూడా జై హనుమాన్‌ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నారా? అనే డౌటానుమానం మొదలైంది.

ఇప్పటికే రిషబ్ శెట్టిని హనుమాన్‌గా పరిచయం చేసి సర్‌ప్రైజ్‌ ఇచ్చిన ప్రశాంత్ వర్మ.. ఫ్యాన్స్‌కు మరో గుడ్‌ న్యూస్‌ చెప్పనున్నట్లు తెలుస్తోంది. రానాను కూడా ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో భాగం చేయనున్నట్లు టాక్ నడుస్తోంది. ఆయన రేంజ్‌కు తగినట్లు పవర్‌ఫుల్‌ రోల్‌ అయి ఉంటుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇందులో రానా నటిస్తున్నారా? లేదా? అన్న విషయంపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement