Prabhas: వేసవిలో ప్రభాస్ 'సలార్‌' !.. 'ఆదిపురుష్‌'కి సీక్వెల్‌ ?

Prabhas Salar Releasing In Summer Sequel To Adipurush - Sakshi

Prabhas Salar Releasing In Summer Sequel To Adipurush: ‘సలార్‌’ సినిమా వచ్చే ఏడాది వేసవిలో థియేటర్స్‌కు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభాస్‌ హీరోగా ‘కేజీఎఫ్‌’ ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఇది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌ 30 శాతం పూర్తయింది. ఈ సినిమాను వచ్చే ఏడాది వేసవిలో లేదా జూన్‌ ఆరంభంలో రిలీజ్‌ చేయనున్నట్లుగా ఈ చిత్రనిర్మాత విజయ్‌ కిరగందూర్‌ పేర్కొన్నారు. విజయ్‌ కిరగందూర్‌ మాట్లాడుతూ.. ‘‘సలార్‌’ షూటింగ్‌ 30 శాతం పూర్తయింది. నెక్ట్స్‌ షెడ్యూల్‌ మే ప్రారంభంలో ఉండొచ్చు. సినిమాను వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నాం’’ అని పేర్కొన్నారు. అయితే ‘సలార్‌’ రెండు భాగాలుగా రాబోతుందా? అనే విషయంపై మాత్రం ఆయన సరైన స్పష్టత ఇవ్వలేదు. శ్రుతీహాసన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ‘సలార్‌’ చిత్రంలో జగపతిబాబు ఓ కీ రోల్‌ చేస్తున్న సంగతి తెలిసిందే.

ఇక పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ హీరోగా నటించిన మరో చిత్రం ‘ఆదిపురుష్‌’. ఈ  మైథలాజికల్‌ ఫిల్మ్‌ను బీటౌన్‌ డైరెక్టర్‌ ఓం రౌత్‌ తెరకెక్కించారు. ఇందులో రాముడి పాత్రలో ప్రభాస్, సీతగా కృతీసనన్, రావణుడిగా సైఫ్‌ అలీఖాన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్‌ నటించారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 12న రిలీజ్‌ కానుంది. అయితే ఈ సినిమాకు సీక్వెల్‌ కూడా ఉంటుందని, ఇందుకు సంబంధించిన స్క్రిప్ట్‌పై ఓం రౌత్‌ వర్క్‌ చేస్తున్నారని బాలీవుడ్‌లో టాక్‌ వినిపిస్తోంది. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top