‘జాంబీ రెడ్డి’ ట్రైలర్‌ను విడుదల చేసిన ప్రభాస్‌ | Prabhas Released Zombie Reddy Trailer | Sakshi
Sakshi News home page

‘జాంబీ రెడ్డి’ ట్రైలర్‌ను విడుదల చేసిన ప్రభాస్‌

Jan 2 2021 8:39 PM | Updated on Jan 2 2021 8:56 PM

Prabhas Released Zombie Reddy Trailer - Sakshi

యంగ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ తెరకెక్కించిన తాజా చిత్రం జాంబీ రెడ్డి. ప‌లు చిత్రాల్లో బాల న‌టుడిగా న‌టించిన తేజ స‌జ్జ జాంబీ రెడ్డి చిత్రంతో హీరోగా ప‌రిచ‌యం అవుతున్నాడు. ఆనంది, దక్ష నగార్కర్‌ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఇటీవల స‌మంత, దిల్‌ రాజు చేతుల మీదుగా విడుదలైన ఈ సినిమా టీజ‌ర్‌, పోస్టర్‌లకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వ‌చ్చింది. దీంతో న్యూ ఇయ‌ర్ గిఫ్ట్‌గా జ‌న‌వ‌రి 2న రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ చేతుల మీదుగా బిగ్ బైట్‌ను విడుదల చేశారు. ఈ సినిమా ట్రైలర్‌ను శనివారం సాయత్రం ప్రభాస్‌ విడుదల చేశారు. తెలుగులో మొదటి జాంబీ చిత్రం అంటూ ట్విటర్‌ వేదికగా రిలీజ్‌ చేశారు. ఈ సందర్భంగా ప్రశాంత్‌ వర్మ, రాజ్‌ శేఖర్‌ వర్మ, తేజ సజ్జ, మార్క్‌ కే రాబిన్‌తోపాటు చిత్ర యూనిట్‌కు ప్రభాస్‌ ఆల్‌ ది బెస్ట్‌ తెలియ జేశారు. చదవండి: దర్శకుడు క్రిష్‌కు కరోనా..

ఇక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సపోర్ట్ చేయడంతో ఈ సినిమాకు మరింత క్రేజ్ వచ్చిందనడంలో సందేహం లేదు. హాలీవుడ్‌ చిత్రాలకు మాత్రమే పరిమితమైన 'జాంబి' జానర్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది. రాయలసీమ నేపథ్యంలో రూపొందిన ఈ సిినిమాను సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఆపిల్ స్టూడియోస్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ జాంబీ రెడ్డి సినిమాకు రాజశేఖర్ వర్మ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మార్క్ కే రాబిన్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో రఘుబాబు, పృథ్వీరాజు, గెటప్‌ శ్రీను, కిరీటి, హరితేజ, అన్నపూర్ణమ్మ తదితరులు నటించారు. చదవండి: దాదాసాహెబ్ ఫాల్కే(సౌత్‌).. విన్నర్స్‌ జాబితా

Advertisement
 
Advertisement
Advertisement