ఆల్ఫా ట్రైలర్‌పై ప్రభాస్ రివ్యూ.. వీరిద్దరి కాంబో ఫిక్సయిందా? | Prabhas Praised Alia Bhatt's Alpha Trailer, Fans Creates Another Rumour | Sakshi
Sakshi News home page

Prabhas: ఆల్ఫా ట్రైలర్‌పై ప్రభాస్ రివ్యూ.. వీరిద్దరి కాంబో ఫిక్సయిందా?

Jul 1 2026 7:04 PM | Updated on Jul 1 2026 7:10 PM

Prabhas Praised Alia Bhatt's Alpha Trailer, Fans Creates Another Rumour

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో పనిచేస్తున్నారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న స్పిరిట్ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీలో ప్రభాస్‌ తొలిసారి పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని భూషణ్‌ కుమార్, ప్రణయ్‌ రెడ్డి వంగా, క్రిషణ్‌ కుమార్, ప్రభాకర్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది మార్చి 5న థియేటర్లలో రిలీజ్‌ కానుంది. అంతే కాకుండా ఫౌజీ, కల్కి-2 మూవీస్‌ కూడా చేస్తున్నారు.

ఇక ప్రభాస్ మూవీ తాజాగా ఆలియా భట్‌ మూవీపై ప్రశంసలు కురిపించారు. స్పై థ్రిల్లర్‌గా వస్తోన్న ఆల్ఫా మూవీ ట్రైలర్‌ చూసిన ప్రభాస్.. తన అభిప్రాయాన్ని పంచుతున్నారు. ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేస్తూ ట్రైలర్‌కు రివ్యూ ఇచ్చేశారు. ఆల్ఫా ట్రైలర్ అద్భుతంగా ఉందని కొనియాడారు. జూలై 3న రిలీజవుతున్న సందర్భంగా ఆల్‌ ది బెస్ట్ అంటూ రాసుకొచ్చారు.

ఇది చూసిన ఆలియా భట్.. ప్రభాస్ పోస్ట్‌కు రిప్లై కూడా ఇచ్చింది. థ్యాంక్ యు అంటూ ప్రభాస్ చేసిన పోస్ట్‌కు స్పందించింది. అయితే దీనిపై ప్రభాస్ ఫ్యాన్స్ భిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు. రెబల్ స్టార్ కేవలం అభినందనలు తెలిపే ఓ సాధారణ పోస్ట్ కాదంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. కల్కి-2లో అలియా భట్ ఫిక్స్ అయిందంటూ పోస్టులు పెడుతున్నారు. అంందుకే ప్రభాస్ ఇలా మెచ్చుకున్నాడని సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement