Prabhas Scripts New Record With Adipurush Box Office Collection Day 1 - Sakshi
Sakshi News home page

Adipurush-Prabhas: ఆ ఘనత సాధించిన ఓన్లీ హీరో ప్రభాస్!

Jun 17 2023 11:48 AM | Updated on Jun 17 2023 1:56 PM

Prabhas New Record With Adipurush First Day Collection - Sakshi

డార్లింగ్ ప్రభాస్ 'ఆదిపురుష్' థియేటర్లలోకి వచ్చేసింది. ఈ సినిమా కొందరికి నచ్చింది, మరికొందరికి నచ్చలేదు. రామాయణాన్ని చాలావరకు మార్చి తీశారని, వీఎఫ్ఎక్స్.. హాలీవుడ్ చిత్రాల్ని తలపించిందని, రావణాసురుడి గెటప్ సరిగా లేదనని.. ఇలా ఎవరికివాళ్లు తమ తమ అభిప్రాయాల్ని చెబుతున్నారు. మరోవైపు టాక్ తో సంబంధం లేకుండా ఇందులో నటించిన ప్రభాస్ సరికొత్త రికార్డు సృష్టించాడు. ప్రస్తుతం ఇదే విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది.

(ఇదీ చదవండి: Adipurush: ఫస్ట్‌ డే కలెక్షన్స్ తుఫాన్)

'బాహుబలి' తర్వాత డార్లింగ్ ప్రభాస్.. పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఈ ఊపులో చాలా సినిమాలు ఒప్పేసుకున్నాడు. వాటిలో సాహో(2019), రాధేశ్యామ్ (2022) ప్రేక్షకుల ముందుకొస్తే, తాజాగా 'ఆదిపురుష్' థియేటర్లలోకి వచ్చింది. రామాయణం ఆధారంగా తీసిన ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసినప్పుడు ఘోరంగా ట్రోల్స్ వచ్చాయి. కానీ ట్రైలర్స్ తో కాస్త రిలీఫ్ అనిపించింది. ఇప్పుడు సినిమా బిగ్ స్క్రీన్ పై చూసిన ఆడియెన్స్ మాత్రం చాలావరకు పెదవి విరుస్తున్నారు.

'ఆదిపురుష్' మూవీ టాక్ ఏంటనేది పక్కనబెడితే తొలిరోజు కలెక్షన్స్ మాత్రం అదిరిపోయే రేంజులో వచ‍్చాయి. ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్ డే దాదాపు రూ.140 కోట్ల వరకు ఈ మూవీ కలెక్ట్ చేసింది. గతంలో 'బాహుబలి', 'సాహో'తో పాటు ఇప్పుడు 'ఆదిపురుష్'.. రిలీజైన మొదటిరోజే రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించాయి. తద్వారా మూడు సినిమాలతో ఈ మార్క్ ని అందుకున్న ఓన్లీ హీరోగా ప్రభాస్ నిలిచాడు. ప్రస్తుతానికైతే ఏ హీరో కూడా.. తొలిరోజు కలెక్షన్స్ విషయంలో ప‍్రభాస్ కి దరిదాపుల్లో లేకపోవడం విశేషం.

(ఇదీ చదవండి: ప్రభాస్ 'ఆదిపురుష్' మూవీ సరికొత్త రికార్డ్)

Advertisement
 
Advertisement
Advertisement