నాగీ మూడేళ్లు నన్ను బుజ్జితో వేధించాడు! | Sakshi
Sakshi News home page

నాగీ మూడేళ్లు నన్ను బుజ్జితో వేధించాడు!

Published Thu, May 23 2024 6:10 AM

Prabhas Kalki 2898 AD Special Creative Event

‘‘హాయ్‌ డార్లింగ్స్‌.. ఎలా ఉంది బుజ్జి, భైరవ గ్లింప్స్‌. ఎంజాయ్‌ చేశారా? ‘కల్కి..’లో అమితాబ్‌ సార్, కమల్‌ సార్‌తో పని చేసే అవకాశం ఇచ్చిన అశ్వినీదత్‌గారికి, నాగీ (నాగ్‌ అశ్విన్‌)కి థ్యాంక్స్‌. హోల్‌ ఇండియా ఇన్‌స్పైర్‌ అయ్యే అమితాబ్, కమల్‌గారు లాంటి గ్రేటెస్ట్‌ లెజెండ్స్‌తో పని చేసే అవకాశం నాకు రావడం నా అదృష్టం’’ అని హీరో ప్రభాస్‌ అన్నారు. ఆయన హీరోగా నటించిన పాన్‌ ఇండియన్‌ చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దీపికా పదుకోన్‌ హీరోయిన్‌. 

అమితాబ్‌ బచ్చన్, కమల్‌హాసన్, దిశా పటానీ కీలక పాత్రలు చేశారు. వైజయంతీ మూవీస్‌పై సి. అశ్వినీదత్‌ నిర్మించిన ఈ సినిమా జూన్‌ 27న విడుదలవుతోంది. కాగా బుధవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ‘కల్కి స్పెషల్‌ క్రియేటివ్‌ ఈవెంట్‌’లో సినిమాలోని బుజ్జి (కారు) పాత్రను పరిచయం చేశారు. ఈవెంట్‌లో ఈ వాహనాన్ని ప్రభాస్‌ నడిపారు. అనంతరం ప్రభాస్‌ మాట్లాడుతూ– ‘‘నాగీ  మూడేళ్లు నన్ను బుజ్జితో వేధించాడు. ఫైనల్లీ బుజ్జీని పరిచయం చేశాం. 

నేనేదో మన డార్లింగ్స్‌కి హాయ్‌ చెప్పి వెళ్లి΄ోదాం అనుకుంటే ఈ కార్లు.. ఫీట్లు ఏంటి సార్‌ (నవ్వుతూ). బుజ్జి సూపర్‌ ఎగ్జయిటింగ్‌. నేను కూడా ‘కల్కి’ టీజర్, సినిమా ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నాను. కమల్‌ సార్‌ ‘సాగర సంగమం’ సినిమా చూసి నాకలాంటి బట్టలు కావాలని మా అమ్మను అడిగాను.. అలాంటివి కుట్టించుకుని వేసుకున్నాను. 

ఇక ఈ వయసులో కూడా అశ్వినీదత్‌గారి ΄్యాషన్‌ చూసి ఆయన వద్ద ఎంతో నేర్చుకోవాలనిపిస్తుంది. నాకు తెలిసి 50 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న నిర్మాత ఆయనొక్కరే. ఆయన కుమార్తెలు స్వప్న, ప్రియాంకలకు కూడా ఆయనలా ΄్యాషన్, ధైర్యం ఉంది. వాళ్లు పని చేసే విధానానికి మేమంతా స్ఫూర్తి ΄÷ందుతాం అని మా సిస్టర్స్‌కి చెబుతుంటాను’’ అన్నారు. ‘‘బుజ్జి కారుని ఎంతో కష్టపడి తయారు చేయించాం. ఇందుకోసం మహీంద్ర ఆటోమొబైల్‌ ఇంజినీర్స్‌ ఎంతో శ్రమించారు’’ అన్నారు నాగ్‌ అశ్విన్‌. నిర్మాతలు అశ్వినీ దత్, స్వ΄్నా దత్, ప్రియాంకా దత్, కృష్ణంరాజు సతీమణి శ్యామల పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement