కామిక్‌–కాన్‌ 2023లో ప్రాజెక్ట్‌ కె | Prabhas, Deepika Padukone Project K Becomes First Ever Indian Film To Debut At San Diego Comic-Con 2023 | Sakshi
Sakshi News home page

కామిక్‌–కాన్‌ 2023లో ప్రాజెక్ట్‌ కె

Jul 8 2023 3:52 AM | Updated on Jul 8 2023 3:52 AM

Prabhas, Deepika Padukone Project K Becomes First Ever Indian Film To Debut At San Diego Comic-Con 2023 - Sakshi

ప్రభాస్‌ హీరోగా తెరకెక్కుతోన్న పాన్‌ ఇండియా చిత్రం ‘ప్రాజెక్ట్‌ కె’ అరుదైన ఘనత సాధించింది. కాలిఫోర్నియాలోని శాన్‌ డియాగోలో నిర్వహించనున్న ‘శాన్‌ డియాగో కామిక్‌–కాన్‌ 2023’ వేడుకలో ‘ప్రాజెక్ట్‌ కె’ సినిమా టైటిల్, ట్రైలర్, సినిమా విడుదల తేదీని లాంచ్‌ చేయనున్నారు. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో దీపికా పదుకోన్‌ హీరోయిన్‌. అమితాబ్‌ బచ్చన్, కమల్‌హాసన్, దిశా పటానీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అశ్వనీదత్‌ ఈ సినిమా నిర్మిస్తున్నారు. నాగ్‌ అశ్విన్‌ మాట్లాడుతూ– ‘‘ఇండియా గొప్ప కథలకు, సూపర్‌ హీరోలకు నిలయం.

మా ‘ప్రాజెక్ట్‌ కె’ సినిమా, కథ గురించి ప్రపంచ ప్రేక్షకులకు పరిచయం చేయడానికి ‘శాన్‌ డియాగో కామిక్‌–కాన్‌ 2023’ సరైన వేదిక అని భావిస్తున్నాం’’ అన్నారు. ‘‘శాన్‌ డియాగో కామిక్‌–కాన్‌ 2023’లో లాంచ్‌ అవుతున్న తొలి భారతీయ చిత్రంగా ‘ప్రాజెక్ట్‌ కె’ చరిత్ర సృష్టించనుంది. ప్రపంచపటంలో భారతీయ సినిమాను చూడాలని కోరుకునే భారతీయ ప్రేక్షకులందరికీ ఇది గర్వకారణం’’ అన్నారు అశ్వనీదత్‌. ఈ నెల 20న ప్రారంభమయ్యే ‘శాన్‌ డియాగో కామిక్‌–కాన్‌ 2023’లో కమల్‌హాసన్, ప్రభాస్, దీపికా పదుకోన్, నాగ్‌ అశ్విన్‌ తదితరులు పాల్గొంటారు.

Advertisement
 
Advertisement
Advertisement