పూనమ్‌ ఇంట్లో అంతా బాగానే ఉందే!: నటి బాడీగార్డు | Sakshi
Sakshi News home page

Poonam Pandey: పూనమ్‌ సోదరి రిప్లై ఇవ్వడం లేదు.. నిజమేంటో తెలియాలి!

Published Fri, Feb 2 2024 5:01 PM

Poonam Pandey Bodyguard Amin Khan Shocked About The Actress Sudden Demise News - Sakshi

బాలీవుడ్‌ నటి పూనమ్‌ పాండే గర్భాశయ క్యాన్సర్‌తో మరణించింది. ఆమె మృతి పట్ల పలువురు సెలబ్రిటీలు, అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. పూనమ్‌ ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులు అర్పిస్తున్నారు. పూనమ్‌ దగ్గర 11 ఏళ్లుగా బాడీగార్డుగా పని చేస్తున్న ఆమిన్‌ ఖాన్‌ నటి ఇక లేరన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు. అతడు మాట్లాడుతూ.. పూనమ్‌ మరణించారన్న వార్తను నేను నమ్మను. ఆమె సోదరితో మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నాను. కానీ తను స్పందించడం లేదు. నటి ఇక లేరన్న విషయాన్ని మీడియాలో చూసే తెలుసుకున్నాను.

ఆమె రిప్లై ఇవ్వట్లేదు
జనవరి 31 వరకు ఆమెతోనే ఉన్నాను. ఒక మాల్‌లో ఫోటోషూట్‌ కూడా చేశాం. తను ఎప్పుడూ ఫిట్‌గా ఉండేది. ఆరోగ్యంగా కనిపించేది. తన అనారోగ్య సమస్య గురించి ఎన్నడూ బయటకు చెప్పలేదు. తనకు ఏదో ఆరోగ్య సమస్య ఉందని కూడా ఎప్పుడూ అనిపించలేదు. అసలు నిజమేంటో తెలియాల్సి ఉంది. తన సోదరి రిప్లై కోసం ఎదురుచూస్తున్నాను. పూనమ్‌ ఈ మధ్య తన ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. మద్యపానం అలవాటు కూడా మానేసింది. నేను తన ఇంటికి వెళ్లినప్పుడు అక్కడి పరిస్థితులు అన్నీ సాధారణంగా ఉన్నట్లే అనిపించాయి' అని చెప్పుకొచ్చాడు.

వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులు
కాగా మోడల్‌గా కెరీర్‌ మొదలుపెట్టిన పూనమ్‌ నటిగానూ కొన్ని సినిమాలు చేసింది. అయితే ఎప్పుడూ ఏదో ఒకరకంగా నిత్యం ఆమె పేరు వార్తల్లో నానుతూ ఉండేది. అశ్లీల ఫోటోలు, వీడియోలు షేర్‌ చేస్తూ ఉండేది. గతంలో ప్రియుడిని పెళ్లాడిన కొద్ది రోజులకే అతడిపై గృహహింస కేసు పెట్టింది. తర్వాత ఇద్దరూ కలిసిపోయారు, కానీ ఎక్కువకాలం కలిసి కొనసాగలేకపోయారు. పూనమ్‌ లాకప్‌ అనే రియాలిటీ షోలోనూ పాల్గొంది.

చదవండి: పూనమ్‌ పాండే: చనిపోయేంత వరకు విమర్శలు, వివాదాలే!

 సౌందర్య టూ పూనమ్‌ పాండే... చిన్న వయసులో తనువు చాలించిన తారలు వీళ్లే!

Advertisement
 
Advertisement