తాప్సీ 'ఫిర్‌ ఆయీ హసీన్‌ దిల్‌రుబా' ట్రైలర్‌ విడుదల | Phir Aayi Hasseen Dillruba Official Trailer Out Now | Sakshi
Sakshi News home page

తాప్సీ 'ఫిర్‌ ఆయీ హసీన్‌ దిల్‌రుబా' ట్రైలర్‌ విడుదల

Jul 25 2024 12:41 PM | Updated on Jul 25 2024 12:45 PM

Phir Aayi Hasseen Dillruba Official Trailer Out Now

తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ఫిర్‌ ఆయీ హసీన్‌ దిల్‌రుబా’.. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్‌ విడుదలైంది. 2021లో విడుదలైన ‘హసీన్‌ దిల్‌రుబా’ చిత్రానికి సీక్వెల్‌గా ఇప్పుడీ చిత్రం డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదల కానుంది. మర్డర్‌ మిస్టరీ కథాంశంతో వినీల్‌ మాథ్యూ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం కోసం అభిమానులు కూడా భారీగానే ఎదురుచూస్తున్నారు.

‘ఫిర్‌ ఆయీ హసీన్‌ దిల్‌రుబా’ సీక్వెల్‌ను జయ్‌ప్రద్‌ దేశాయ్‌ దర్శకత్వం వహించారు. కనికా థిల్లాన్‌ నిర్మాత. ఇందులో విక్రాంత్‌ మాస్సే, తాప్సీ ప్రధాన పాత్రల్లో నటించారు. మర్డర్‌ మిస్టరీ, సైకలాజికల్‌ థ్రిల్లర్‌ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం ఆగష్టు 9న డైరెక్ట్‌గా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతుందని కొద్దిరోజుల క్రితం మేకర్స్‌ ప్రకటించారు. ఇప్పడు విడుదలైన ట్రైలర్‌ ప్రేక్షకులను మెప్పించేలా ఉంది. కథపై మంచి గ్రిప్పింగ్‌ ఉండేలా ట్రైలర్‌ను మేకర్స్‌ కట్‌ చేశారు.

నిర్మాత కనికా ధిల్లాన్ మాట్లాడుతూ తాప్సీ పన్ను చాలా అద్భుతంగా ఈ చిత్రంలో నటించారని తెలిపింది. పార్ట్‌ 1 కంటే సీక్వెల్‌లో ఆమె అందరినీ ఆకట్టుకునేలా మెప్పించారని చెప్పారు. మరో ప్రధాన పాత్రలో నటించిన విక్రాంత్‌మాస్సే  గురించి కూడా ఆమె మాట్లాడింది. ఆయనలోని ప్రతిభ ఈ సినిమాతో మరింతగా ప్రకాశిస్తుందని కనికా చెప్పింది. మీర్జాపూర్‌లో బబ్లూ పండిట్‌ పాత్రలో కనిపించిన విక్రాంత్‌ తెలుగువారికి పరిచయం అయ్యాడు. '12th ఫెయిల్‌' సినిమాతో మరింత పాపులర్‌ అయ్యాడు.

ఫ‌స్ట్ పార్ట్‌లో భ‌ర్త (విక్రాంత్‌ మాస్సే)తో క‌లిసి పక్కా ప్లాన్‌తో ప్రియుడిని చంపిన రాణి కశ్యప్‌(తాప్సీ) ఆపై అక్కడి నుంచి ఆమె పారిపోయి కొత్త జీవితంలోకి అడుగుపెడుతుంది. ఈ కేసులో రాణిని తన భర్త కాపాడుతాడా..? అనేది తెలియాలంటే ఆగష్టు 9న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానున్న  'ఫిర్‌ ఆయీ హసీన్‌ దిల్‌రుబా' సినిమా  చూడాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement