
మెగా హీరో వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి ఈ మధ్యే పేరెంట్స్‌గా ప్రమోషన్ పొందారు. ఈ జంటకు మగపిల్లాడు జన్మించాడు. అత్తగా ప్రమోషన్ పొందడంతో నిహారిక (Niharika Konidela) ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిహారిక అత్తగా ఫుల్ బిజీ అయ్యానంటోంది. ఆమె మాట్లాడుతూ.. మా అన్నకు కొడుకు పుట్టినప్పటినుంచి నాకెవరూ పనులు చెప్పడం లేదు.
సెపరేట్‌గా ఉంటున్నా..
ఎందుకంటే నేనెప్పుడూ వాడిని ఎత్తుకునే ఉంటున్నాను. లేకపోతే నీళ్లు తీసుకురాపో, ఆ పని చేయు అంటూ ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు. వాడు పెద్దయ్యాక యాక్టర్ అవుతానంటే మాత్రం కచ్చితంగా నా బ్యానర్‌లోనే సినిమా తీస్తాను. ప్రస్తుతం నేను సెపరేట్‌గా ఉంటున్నాను. అలా అని కుటుంబానికి దూరంగా ఉండను. రెండురోజులకోసారైనా కచ్చితంగా ఇంట్లోవాళ్లందరినీ కలుస్తాను. ఎందుకంటే వీళ్లే నా జీవితం.
హీరోయిన్‌గా సినిమా చేస్తా
కుటుంబసభ్యుల ముందుకు వెళ్లానంటే నా ఒత్తిడినంతా మర్చిపోతాను. నా మొదటి సినిమా 'ఒక మనసు'లో నేనంత బాగా నటించలేదు. ఆ మూవీ కోసం నేను చాలా కష్టపడ్డాను. కానీ, అప్పుడు నాకు 20 ఏళ్లే! హీరోయిన్‌గా ఏదైనా మంచి సినిమా ఆఫర్ వస్తే చేయాలనుకుంటున్నాను. ఈ మధ్య వచ్చినవాటిలో మిరాయ్ మూవీ నచ్చింది. ఇటీవలే పుస్తకాలు చదవడం కూడా మొదలుపెట్టాను అని నిహారిక చెప్పుకొచ్చింది.
చదవండి: అమ్మకు క్యాన్సర్.. నాన్నకలా జరిగితే ఏడవలేదు: షణ్ను ఎమోషనల్