సూపర్‌ హిట్‌ డైరెక్టర్‌తో 'తారక్‌' పాన్‌ ఇండియా సినిమా | Nelson Dilipkumar And Jr NTR Big Movie Plan | Sakshi
Sakshi News home page

సూపర్‌ హిట్‌ డైరెక్టర్‌తో 'తారక్‌' పాన్‌ ఇండియా సినిమా

Nov 9 2024 3:31 PM | Updated on Nov 9 2024 3:44 PM

Nelson Dilipkumar And Jr NTR Big Movie Plan

ఈ ఏడాదిలో ఎన్టీఆర్‌ నటించిన దేవర సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇండియన్‌ బాక్సాఫీస్‌ వద్ద సుమారు రూ. 500 కోట్లకు పైగానే కలెక్షన్స్‌ రాబట్టి రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. ఇప్పుడు తారక్‌ చేతిలో రాబోయే సినిమాలన్నీ కూడా పాన్‌ ఇండియా రేంజ్‌లో విడుదల కానున్నాయి. ఈ క్రమంలో ఆయన దేవర2, వార్‌2, చిత్రాలతో పాటు ప్ర‌శాంత్ నీల్‌తో కూడా ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా మరో స్టార్‌ డైరెక్టర్‌తో ఎన్టీఆర్‌ సినిమా చేసేందుకు రెడీగా ఉన్నారని తెలుస్తుంది.

కోలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ నెల్స‌న్ దిలిప్‌కుమార్‌తో తారక్‌ ఒక ప్రాజెక్ట్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జనీకాంత్‌కు జైల‌ర్ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్‌ను అందించిన ద‌ర్శ‌కుడు నెల్స‌న్ దిలిప్‌కుమార్‌.. ఆయనతో సినిమా అంటే మామూలుగా ఉండదంటూ ఫ్యాన్స్‌ కూడా కామెంట్లు చేస్తున్నారు. వరుస డిజాస్టర్‌ సినిమాలతో ఉన్న రజనీకాంత్‌కు జైలర్‌ సినిమాతో నెల్స‌న్ భారీ విజయానందించారు. ఏడాది క్రితం జైలర్‌తో బాక్సాఫీస్‌ వద్దకు వచ్చిన ఆయన ఇప్పటికీ ఎలాంటి సినిమా  చేస్తారా..? అనే ప్రశ్నలు వస్తున్నాయి.

నెల్స‌న్ దిలిప్‌కుమార్‌ డైరెక్ట్‌ చేసిన చిత్రాలు  బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురిపించాయి. డాక్టర్‌,జైలర్‌,బీస్ట్‌ వంటి సినిమాలు సత్తా చాటాయి. ఇప్పుడు తారక్‌తో ఆయన సినిమా చేయబోతున్నాడని వార్తలు వస్తుండంతో ఇరువురి ఫ్యాన్స్‌ కూడా సంబరాలు చేసుకుంటున్నారు. రీసెంట్‌గా ఆయ‌న నిర్మాతగా  'బ్ల‌డీ బెగ్గ‌ర్' అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో క‌విన్ హీరోగా మెప్పించాడు. ఈ సినిమా అనంత‌రం జైల‌ర్ 2 సీక్వెల్ తెర‌కెక్కించేప‌నిలో నెల్స‌న్ ఉన్నాడు .  ఈ ప్రాజెక్ట్ అనంత‌రం  తార‌క్ కోసం నెల్స‌న్ ఒక బిగ్‌ ప్లాన్‌ వేయనున్నట్లు టాక్‌.

Advertisement
 
Advertisement
Advertisement