ఒక్క సీన్‌ కోసం రూ. 5 కోట్లు అందుకున్న నయనతార | Nayanthara Remuneration For One Ad | Sakshi
Sakshi News home page

ఒక్క సీన్‌ కోసం రూ. 5 కోట్లు అందుకున్న నయనతార

Mar 17 2024 6:56 AM | Updated on Mar 17 2024 10:01 AM

Nayanthara Remuneration For One Ad - Sakshi

సౌత్‌ ఇండియాలో స్టార్‌ హీరోయిన్‌గా కొనసాగుతున్న నయనతార రీసెంట్‌గా అన్నపూరణి చిత్రంతో దిగ్విజయంగా 75 చిత్రాలను పూర్తి చేసుకుంది. యోగి,చంద్రముఖి,యోగి, బిల్లా, క‌ర్త‌వ్యం, శ్రీరామరాజ్యం, మాయ, అరం వంటి  విభిన్నమైన కథా చిత్రాల ద్వారా నయనతారను లేడీ సూపర్‌స్టార్‌ను చేశాయి. ఇకపోతే వ్యక్తిగతంగా ఎన్నో అవరోధాలను అధిగమించి ఇండియన్‌ స్టార్‌గా వెలుగొందుతున్నా రు. కెరీర్‌ ప్రారంభంలో నటుడు శింబుతో రొమాన్స్‌, లిప్‌లాక్‌ దృశ్యాలతో వార్తల్లోకి ఎక్కిన నయనతార, ఆ తరువాత నటుడు, నృత్యదర్శకుడు ప్రభుదేవాతో సహజీవనం, మతం మార్పు వంటి సంఘటనలతో వార్తల్లో కెక్కారు.

ఆ తరువాత దర్శకుడు విగ్నేశ్‌ శివన్‌తో పరిచయం ప్రేమగా మారడం, అలా ఆరేళ్ల ప్రేమ పెళ్లికి దారి తీయడం, పెళ్లి అయిన నాలుగు నెలల్లోనే సరోగసీ విధానం ద్వారా ఇద్దరు కవల పిల్లలకు తల్లి కావడం వంటి సంఘటనలు అన్నీ నయనతార కేరీర్‌లో సంచలన సంఘటనలే. ఇప్పటికీ అగ్ర కథానాయకిగా రాణిస్తున్న ఈమె ఇటీవల జవాన్‌ చిత్రంతో బాలీవుడ్‌ ఎంట్రీ సక్సెస్‌పుల్‌గా జరిగింది.

ఇది ఇలా ఉంటే మొన్నటి వరకూ వాణిజ్య ప్రకటనలకు దూరంగా ఉంటూ వచ్చిన నయనతార ఇప్పుడు ఆ రంగంలోనూ తనదైన ముద్ర వేసుకున్నారు. ఒక్క వాణిజ్య ప్రకటనలో నటించడానికి ఏకంగా రూ.5 కోట్లు పారితోషికం పుచ్చుకున్నారన్నది తాజా సమాచారం. ఇటీవల టాటా స్కై ప్రకటనలో నటించడానికి, మామిడి రసం ప్రకటనలో నటించడానికి రూ.5 కోట్లు పారితోషికం అందుకున్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. ఇవి కేవలం 50 సెకన్ల నిడివితో కూడిన ప్రకటనలు అన్నది గమనార్హం. దీంతో నయనతార మజాకా అంటున్నారు నెటిజన్లు. ఇప్పుటికీ చేతి నిండా చిత్రాలతో ఈ భామ బిజీగా ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement